అదే ధ‌నుష్ సినిమాని దెబ్బ‌కొట్టిందా?

ధ‌నుష్ న‌టించి రూపొందించిన `రాయ‌న్‌` తెలుగు, త‌మిళ భాష‌లలో భారీ ఓపెనింగ్స్‌ని సాధించింది. ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా వ‌చ్చిన ఫ‌స్ట్ డే ఓపెనింగ్స్ రూ.24 కోట్లు.;

Update: 2026-05-01 12:30 GMT

కోలీవుడ్ క్రేజీ హీరోల్లో ధ‌నుష్‌కున్న ప్ర‌త్యేక‌తే వేరు. డైరెక్ట‌ర్‌గా, హీరోగా వ‌రుస సినిమాలు చేస్తూ మిగ‌తా హీరోల‌కు భిన్నంగా ఏడాదికి రెండు నుంచి మూడు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. గ‌త ఏడాది `కుబేర‌`, ఇడ్లీ కడై, హిందీలో `తేరే ఇష్క్ మే` వంటి సినిమాలు చేశాడు. ఇందులో `ఇడ్లీ క‌డై`ని న‌టించి రూపొందించ‌డం తెలిసిందే. ఈ ఏడాది కూడా రెండు నుంచి మూడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించేందుకు ప్లాన్ చేసుకున్నాడు ధ‌నుష్‌.

అందులో భాగంగా ముందుగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన మూవీ `క‌ర‌`. విఘ్నేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. `పోర్ త‌మిళ్‌` మూవీతో ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్న విఘ్నేష్ రాజా డైరెక్ట్ చేయ‌డంతో `క‌ర‌`పై అభిమానుల్లో మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌తో ఆస‌క్తిని రేకెత్తించిన `క‌ర‌` ఏప్రిల్ 30న త‌మిళంతో పాటు తెలుగులోనూ భారీగా విడుద‌లైంది. విభిన్న‌మైన క‌థ‌ల‌ని ఎంచుకుంటూ ఏదో ఒక కొత్త పాయింట్‌ని, కొత్త స్టోరీని ప్రేక్ష‌కుల‌కు అందించే ధునుష్ `క‌ర‌`ని కూడా అలాగే అనుకున్నారు ఫ్యాన్స్‌.

కానీ ఆశించిన స్థాయిలో `క‌ర‌` ఆక‌ట్టుకోలేక‌పోయింది. `కుబేర‌`, ఇడ్లీ క‌డై` చిత్రాల త‌రువాత ధ‌నుష్ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో అంతా అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ వారి అంచ‌నాల్ని ఏ విష‌యంలోనూ `క‌ర‌` అందుకోలేక‌పోయింది. అంతే కాకుండా ఓపెనింగ్స్ విష‌యంలోనూ త‌మిళంతో పాటు తెలుగులోనూ తీవ్ర నిరాశ‌కు గురి చేసి షాక్ ఇచ్చింద‌ని చెప్పొచ్చు.

ధ‌నుష్ న‌టించి రూపొందించిన `రాయ‌న్‌` తెలుగు, త‌మిళ భాష‌లలో భారీ ఓపెనింగ్స్‌ని సాధించింది. ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా వ‌చ్చిన ఫ‌స్ట్ డే ఓపెనింగ్స్ రూ.24 కోట్లు. ఇక శేఖ‌ర్ క‌మ్ముల‌తో క‌లిసి ధ‌నుష్ చేసిన `కుబేర‌`కు కూడా రికార్డు స్థాయిలో రూ.26 కోట్ల‌కు పైనే ఓసెనింగ్స్ రావ‌డం గ‌మ‌నార్హం. అయితే ఈ జోరుని `ఇడ్లీ క‌డై` కొన‌సాగించ‌లేక‌పోయింది. ఈ సినిమాకు వ‌చ్చిన ప్రారంభ వ‌సూళ్లు కేవ‌లం రూ.11 కోట్లు మాత్ర‌మే. దీనికి కార‌ణం ప్ర‌మోష‌న్స్ ప్రాప‌ర్‌గా ఏయ‌క‌పోవ‌డం, బ‌ల‌మైన క‌థ‌, క‌థ‌నాలు లేక‌పోవ‌డ‌మే.

ఇప్పుడు ఇదే ఫామ్‌ని `క‌ర‌` కూడా కొన‌సాగించిన‌ట్టుగా తెలుస్తోంది. ఫ‌స్ట్ డే ఈ సినిమా రాబ‌ట్టిన వ‌సూళ్ల‌ని చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ మూవీకి ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్‌గా వ‌చ్చిన ఓపెనింగ్స్ రూ.5.75 ల‌క్ష‌లు మాత్ర‌మే. ఇదే ఇప్పుడు ధ‌నుష్ అభిమానుల్ని క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది. తెలుగులోనే కాకుండా త‌మిళంలోనూ ఈ సినిమా పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయింది. ధ‌నుష్ గ‌త సినిమాల‌కు ఏ మాత్రం పోలిక లేని వ‌సూళ్ల‌ని `క‌ర‌` రాబ‌ట్టి షాక్ ఇవ్వ‌డానికి ప్ర‌ధాన కార‌ణం సినిమా ప్ర‌మోష‌న్స్‌. ఆశించిన స్థాయిలో మేక‌ర్స్ చేయ‌లేదు. ఇదే ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారి ప్రారంభ వ‌సూళ్ల‌కు గండి కొట్టిందనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ కూడా అంత ఎట్రాక్టివ్‌గా లేక‌పోవ‌డం కూడా మ‌రో కార‌ణంగా చెబుతున్నారు. ధ‌నుష్ ఆ జాగ్ర‌త్త‌లు తీసుకుని ఉంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేద‌ని అంటున్నారు.

Tags:    

Similar News