• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కోలీవుడ్ స్టార్.. జనతా...

కోలీవుడ్ స్టార్.. జనతా గ్యారేజ్ అరుదైన మొక్క..!

| జనతా గ్యారేజ్ ఎన్ టీ ఆర్ డైలాగ్ ప్రకారం చెప్పాలంటే ధనుష్ ఒక అరుదైన మొక్క అతన్ని అలానే ఉండనిద్దాం ఆయన నుంచి ఇంకా సరికొత్త కథలు ప్రయోగాలు రావాలని ఆడియన్స్ కోరుతున్నారు.

By - Tupaki Desk
Update: 2024-11-03 04:14 GMT

కోలీవుడ్ స్టార్ హీరోల్లో అతనొక ప్రత్యేకం.. అందరు కమర్షియల్ సినిమాలు తీసి హిట్లు సూపర్ హిట్లు కొడుతుంటే అతను మాత్రం వెరైటీ సినిమాలు చేస్తూ తన స్టార్ డం కొనసాగిస్తున్నాడు. ఆ స్టార్ హీరో సినిమా వస్తుంది అంటే చాలు ఆడియన్స్ అంతా ఈసారి ఎలాంటి కథతో వస్తాడా అని ఆసక్తిగా ఉంటారు. హీరోనే కాదు డైరెక్టర్ గా కూడా తన మార్క్ వేసుకుంటున్న ఆ స్టార్ యాక్టర్ కం డైరెక్టర్ ఎవరో ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. యెస్ అవును అతనే కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ధనుష్.

 

కమర్షియల్ సినిమాకు లెక్కలు మారుస్తూ సినిమా అంటే మన చుట్టూ జరిగే కథలే అని చాటి చెబుతూ మరొకరికి సాధ్యం కాని కథలు, పాత్రలు చేస్తూ తన సత్తా చాటుతున్నాడు ధనుష్. అందుకే ఆయనకు పాన్ ఇండియా లెవెల్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. స్టార్ ఇమేజ్ లో కొందరు కేవలం కమర్షియల్ సినిమాలే చేస్తారు. ప్రయోగాలు చేస్తే అతన్ని ఆయన ఫ్యాన్సే యాక్సెప్ట్ చేయలేరు. కానీ ధనుష్ విషయంలో అలా కాదు అతను ఎలాంటి సినిమా చేసినా సరే సూపర్ అనేస్తారు.

ముఖ్యంగా తన కథల ఎంపికతో ఆడియన్స్ కు షాక్ ఇస్తుంటాడు ధనుష్. ఎంచుకున్న పాత్రకు పూర్తిస్థాయి న్యాయం చేస్తూ తానెందుకు స్పెషల్ అనేది చాటి చెబుతున్నాడు. ధనుష్ చేస్తున్న సినిమాలు కథలు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందిస్తున్నాయి. అందుకే ఆయనకు నేషనల్ అవార్డ్ సైతం వచ్చింది. జనతా గ్యారేజ్ ఎన్ టీ ఆర్ డైలాగ్ ప్రకారం చెప్పాలంటే ధనుష్ ఒక అరుదైన మొక్క అతన్ని అలానే ఉండనిద్దాం ఆయన నుంచి ఇంకా సరికొత్త కథలు ప్రయోగాలు రావాలని ఆడియన్స్ కోరుతున్నారు.

ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు తన డైరెక్షన్ లో ఇడ్లీ కొట్టు సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాల విషయంలో ధనుష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. కుబేర సినిమా మరోసారి ధనుష్ యాక్టింగ్ స్టామినా చూపిస్తుందని అంటున్నారు. శేఖర్ కమ్ముల చాలా సెన్సిటివ్ సినిమాలు చేస్తుంటాడు. మరి కుబేరతో ధనుష్ ని ఎలా ప్రెజెంట్ చేస్తున్నాడు అన్నది చూడాలి. కుబేర ఫస్ట్ లుక్ మాత్రం అంచనాలకు తగినట్టుగానే అదిరిపోయింది. తన డైరెక్షన్ లో వచ్చిన రాయన్ సక్సెస్ అవ్వడంతో ఆ ప్రోత్సాహంతో కొత్త సినిమా ఇడ్లీ కొట్టు సినిమా తీస్తున్నాడు ధనుష్. ఈ సినిమా కూడా డిఫరెంట్ కథతో వస్తున్నట్టు తెలుస్తుంది.

Tags:    
  • Kollywood 
  • Staractor 
  • Dhanush 
  • Director 
  • JanataGarage 
  • NTRDialogue 
  • Filmindustry 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS