D54: ధనుష్ మరో కొత్త ప్రయోగం
ఈ సినిమా ధనుష్ కెరీర్‌లో 54వ చిత్రం. సెన్సిటివ్ కథనాల్ని తెరకెక్కించడంలో దిట్ట అయిన విగ్నేష్ రాజా ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.;
సూపర్ టాలెంట్, వెర్సటైల్ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న కోలీవుడ్ హీరో ధనుష్.. మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో అభిమానులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవలే కుబేర సినిమాతో మంచి హిట్ అందుకున్న ధనుష్, తన నెక్స్ట్ సినిమాగా పూర్తి స్థాయి రూరల్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటివరకు వేరే వేరే జానర్స్‌లో నటించిన ఈ హీరో.. ఇప్పుడు మళ్లీ ఓ డిప్ ఎమోషనల్ కథ కోసం రెడీ అవుతున్నాడు.
ఈ సినిమా ధనుష్ కెరీర్‌లో 54వ చిత్రం. సెన్సిటివ్ కథనాల్ని తెరకెక్కించడంలో దిట్ట అయిన విగ్నేష్ రాజా ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. పలు చిన్న సినిమాలతో పేరు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. ఈసారి ధనుష్‌తో కలిసి ఓ డిఫరెంట్ కథను తెరపై ఆవిష్కరించనున్నట్టు తెలుస్తోంది. ఈ కాంబినేషన్ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే మంచి అంచనాలున్నాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ధనుష్ తలదించుకుని నిలబడిన విధానం, వెనుక కాలిపోతున్న పత్తి పంటలు కనిపించగా, గ్రామీణ వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విజువల్ చూస్తే.. ధనుష్ ఈ సినిమాలో రైతు పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. రైతుల జీవితం, కష్టాలు, నష్టాలు వంటి భావోద్వేగాలను ఈ సినిమా ప్రధానంగా ప్రస్తావించనుందని అనిపిస్తుంది.
ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌కు ఇప్పటికే కొన్ని బ్లాక్‌బస్టర్ ఆల్బమ్స్ ఉన్న నేపథ్యంలో.. ఈసారి కూడా మంచి మ్యూజిక్ ట్రాక్ రావొచ్చనే నమ్మకం వుంది. కథనానికి తగ్గ మ్యూజిక్‌తో భావోద్వేగాన్ని మరింత పెంచేందుకు జీవీ ప్రాసెస్‌లో ఉన్నాడట. రూరల్ బ్యాక్‌డ్రాప్‌కు అనుగుణంగా ట్రెడిషనల్ టచ్‌తో మ్యూజిక్ ఉండనుంది.
వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, థింక్ స్టూడియోస్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లిమిటెడ్ బడ్జెట్‌తో కాకుండా, కథకు తగ్గట్టుగా మంచి ప్రొడక్షన్ విలువలతో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం షూటింగ్ ప్రారంభమైంది. తొలిదశలోనే సినిమా కాన్సెప్ట్‌కు సంబంధించి ఆసక్తికరంగా ప్రచారం జరగడం ఈ చిత్రానికి బజ్ పెంచుతోంది. మొత్తానికి ధనుష్ - విగ్నేష్ రాజా కాంబినేషన్ నుంచి వస్తున్న ఈ న్యూ ఏజ్ రూరల్ డ్రామా.. భావోద్వేగాలకు, రైతు సమస్యలకు అద్దం పడుతూ, థియేటర్లలో ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి ఇవ్వనుంది. మరి ధనుష్ మళ్లీ తన నటనతో ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో చూడాలి.