• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జోరు పెంచిన ధనుష్.. ఏకైక...

జోరు పెంచిన ధనుష్.. ఏకైక నటుడిగా గుర్తింపు?

| ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఒకవైపు హీరోగా.. మరొకవైపు డైరెక్టర్ గా బిజీగా మారిపోయారు.

By - Madhu Reddy
Update: 2025-10-05 16:30 GMT

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఒకవైపు హీరోగా.. మరొకవైపు డైరెక్టర్ గా బిజీగా మారిపోయారు. ఈమధ్య కాలంలో సాధారణంగా హీరోలు ఒక ఏడాదికి ఒక సినిమా చేయడానికే కిందా మీదా పడుతుంటే.. ధనుష్ మాత్రం ఒక వైపు హీరోగా మరొకవైపు దర్శకుడిగా ఏడాదికి మూడు నాలుగు చిత్రాలను విడుదల చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా ఈయన స్పీడ్ చూస్తుంటే.. ఏడాదికి ఐదు సినిమాలు రిలీజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అనడంలో సందేహం లేదు. పైగా ధనుష్ ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు సినిమాలు విడుదల చేస్తూ..ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ఇకపోతే ఇప్పటివరకు ఈయన హీరోగా నటించిన చిత్రాలు అలాగే ఈ మధ్య దర్శకత్వం వహిస్తున్న చిత్రాల విషయాన్ని ఒకసారి గమనిస్తే ధనుష్ స్పీడు అందరికీ అర్థమవుతుంది. ఈ ఏడాది ధనుష్ ఏకంగా మూడు రిలీజ్ లతో అభిమానులను కూడా ఆశ్చర్యపరచబోతున్నారు. ఇప్పటికే జూన్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'కుబేర' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఇక తాజాగా 'ఇడ్లీ కొట్టు' అంటూ అక్టోబర్ ఒకటో తేదీన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి దర్శకుడు కూడా ఈయనే కావడం గమనార్హం. ' ఇడ్లీ కడై' అంటూ తమిళంలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకోగా.. ఇడ్లీ కొట్టు పేరుతో తెలుగులో వచ్చిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేదు.

ఇదిలా ఉండగా.. ధనుష్ ఈ ఏడాది నటుడిగా కాకుండా కేవలం దర్శకత్వం మాత్రమే వహించిన చిత్రం ' జాబిలమ్మ నీకు అంత కోపమా.. ' ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది ఈ సినిమా. అంటే ఈ స్టార్ హీరో దర్శకత్వం వహించిన రెండు చిత్రాలు ఈ ఏడాది రిలీజ్ అయ్యాయి. దీనిని అరుదైన విషయం గా కూడా పరిగణించవచ్చు.

2025లో ధనుష్ హంగామా అంతటితో ఆగిపోవట్లేదు. వచ్చే నెలలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఇది బాలీవుడ్ చిత్రం కావడం విశేషం. ధనుష్ తో ఇంతకుముందు 'రన్ జానా' ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసిన ఆనంద్ ఎల్ . రాయ్ దర్శకత్వంలో వస్తున్న 'తేరే ఇష్క్ మే' సినిమాలో ధనుష్ నటిస్తున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్ నటిస్తూ ఉండగా.. మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇకపోతే ఇది విడుదలైన మూడు నెలలకే ధనుష్ నుంచి మరో మూవీ కూడా రాబోతోంది. విగ్నేష్ రాజా అనే యువ దర్శకుడితో ఆయన సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు చివరిదశకు చేరుకుంది. అలాగే ఓం రౌత్ దర్శకత్వంలో అబ్దుల్ కలాం బయోపిక్ లో కూడా ధనుష్ నటించనున్నారు. వచ్చే ఏడాది ఈ రెండు సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ధనుష్ ఇలా ఒకవైపు హీరోగా.. మరొకవైపు దర్శకుడిగా వరుస సినిమాలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద దర్శకుడిగా, హీరోగా ఒకే కాలంలో అత్యధిక చిత్రాలు రిలీజ్ ఇస్తూ ఏకైక నటుడిగా గుర్తింపు అందుకుంటున్నారు.

Tags:    
  • Dhanush 
  • Dhanush2025 
  • DhanushFilms 
  • TereIshqMein 
  • IdliKottu 
  • Kubera 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS