స్టార్ హీరో దంతాలకు ధనశ్రీ వర్మ చికిత్స
దిల్ రాజు నిర్మిస్తున్న `ఆకాశం దాటి వస్తావా?` సినిమాతో టాలీవుడ్ కి పరిచయమవుతోంది ధనశ్రీ వర్మ.;
దిల్ రాజు నిర్మిస్తున్న `ఆకాశం దాటి వస్తావా?` సినిమాతో టాలీవుడ్ కి పరిచయమవుతోంది ధనశ్రీ వర్మ. కొరియోగ్రాఫర్ గా సుపరిచితురాలైన ధనశ్రీ, ఇటీవల తన భర్త, క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. భారత దేశంలో అత్యంత చర్చనీయాంశమైన సెలబ్రిటీ విడాకుల కేసుల్లో ఇది ఒకటి. ప్రస్తుతం యూవీతో తాను స్నేహంగా ఉన్నానని, అంతా సెటిలైందని ధనశ్రీ తాజాగా కొరియోగ్రాఫర్ కం వ్లాగర్ ఫరాఖాన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఫరాఖాన్ తో చిట్ చాట్ లో ధనశ్రీ వర్మ కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసారు. అగ్రనిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న `ఆకాశం దాటి వస్తావా?` సినిమా గురించి ప్రస్థావిస్తూ.. ఇది డ్యాన్స్ బేస్డ్ డ్రామాతో రూపొందుతోందని, త్వరలో విడుదలకు రానుందని వెల్లడించింది. తనకు అత్యంత ఇష్టమైన డ్యాన్స్ నేపథ్యంలోని సినిమా చేయడం ఆనందాన్నిస్తోందని ధనశ్రీ పేర్కొంది.
అలాగే తాను కొరియోగ్రాఫర్ కం నటిగా మారక ముందు ఆరంభం డెంటిస్టుగా బాంద్రా (ముంబై)లో క్లినిక్ నడిపానని కూడా ధనశ్రీ తెలిపారు. మూడేళ్ల పాటు దంత వైద్యురాలిగా క్లినిక్ ని నడిపానని వెల్లడించారు. ``బాంద్రా - లోఖండ్‌వాలాలో ఒక క్లినిక్ ఉండేది. సినీతారలంతా నా క్లినిక్‌కి వచ్చేవారు.. నేను రణబీర్ కపూర్‌కు కూడా ఒకసారి చికిత్స చేసాను`` అని ధనశ్రీ గుర్తుచేసుకుంది.
అయితే ఆ సమయంలో ఫరా సరదాగా ప్రశ్నిస్తూ..నువ్వు అతడి నోటిలోకి చూశావా? ఎలా ఉంది? అదేమైనా భిన్నంగా ఉందా? అని ఛమత్కరిస్తూ నవ్వేసారు. దానికి ధనశ్రీ సమాధానమిస్తూ.. ``అది నా పని.. దంతాలకు చికిత్స ఆరోగ్యకరమైనది.. మంచి పరిశుభ్రతనిస్తుంది`` అని అన్నారు. ధనశ్రీ గతంలో ఫరాఖాన్ హోస్ట్ చేసిన ఝలక్ దిఖలాజాలో పెర్ఫామ్ చేసింది. అలాగే బిగ్ బాస్ లోను కనిపించింది. తర్వాత కొరియోగ్రాఫర్ గా సొంత యూట్యూబ్ కంటెంట్ తోను పాపులరైంది. క్రికెటర్ చాహల్ తో డేటింగ్, పెళ్లి అనంతరం తక్కువ సమయంలోనే విడాకుల కారణంగా మరింతగా ప్రజల్లో పాపులరైంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, అష్నీర్ గ్రోవర్ రియాలిటీ షో `రైజ్ & ఫాల్`లో ధనశ్రీ నటిస్తోంది. ఇది అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్‌లో ప్రీమియర్ కానుంది. ఆ తర్వాత దిల్ రాజు నిర్మిస్తున్న డ్యాన్స్ బేస్డ్ చిత్రం `ఆకాశం దాటి వస్తావా?` కూడా విడుదలకు రానుంది.