దేవీ శ్రీ ప్ర‌సాద్ లో మ‌రో హిడెన్ టాలెంట్

ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న దేవీ శ్రీ ప్ర‌సాద్, సినిమాల‌తో, మ్యూజిక్ తో ఎంత బిజీగా ఉన్నా సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ త‌న అభిమానుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు అప్డేట్స్ ను అందిస్తూ ట‌చ్ లో ఉంటారు.;

Update: 2025-08-20 10:07 GMT

దేవీ శ్రీ ప్ర‌సాద్. సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో ఇత‌ని గురించి తెలియ‌ని వారుండ‌రు. చిన్న వ‌య‌సులోనే మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా మంచి పేరుతో పాటూ స‌క్సెస్ ను అందుకున్న దేవీ మ‌ల్టీ టాలెంటెడ్ ప‌ర్స‌న్. కేవ‌లం సంగీతం అందించ‌డ‌మే కాకుండా పాటలు రాయ‌డం, ఫోటోగ్ర‌ఫీ, కొరియోగ్ర‌ఫీ.. ఇలా చాలానే టాలెంట్స్ ఉన్నాయి అత‌నిలో. ప్ర‌స్తుతం దేవీ శ్రీ ప్ర‌సాద్ ఇండియాలోని టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతున్నారు.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా..

ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న దేవీ శ్రీ ప్ర‌సాద్, సినిమాల‌తో, మ్యూజిక్ తో ఎంత బిజీగా ఉన్నా సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ త‌న అభిమానుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు అప్డేట్స్ ను అందిస్తూ ట‌చ్ లో ఉంటారు. అందులో భాగంగానే దేవీశ్రీ ప్ర‌పంచ ఫోటోగ్ర‌ఫీ దినోత్స‌వం సంద‌ర్భంగా చేసిన పోస్ట్ ఒక‌టి ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతుంది.

త‌ల్లిదండ్రుల కోసం గోల్డ్ డిజైన‌ర్‌గా..

ఈ సంద‌ర్భంగా దేవీ శ్రీ చేసిన పోస్టులో త‌న త‌ల్లిదండ్రుల‌ను ఫోటో తీస్తోన్న ఓ స్పెష‌ల్ పిక్ ను షేర్ చేస్తూ దానికి సంబంధించిన సిట్యుయేష‌న్ గురించి వెల్లడించారు. ఆ ఫోటో అంటే త‌న‌కెంతో ఇష్ట‌మని, దానికి కార‌ణాన్ని కూడా తెలిపారు దేవీ. ఇండ‌స్ట్రీలో 15 ఏళ్ల మ్యూజికల్ జ‌ర్నీ పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా దేవీ త‌న తండ్రికి గోల్డ్ మ్యూజిక‌ల్ స్టైల్ బ్రేస్‌లెట్, త‌ల్లికి వ‌జ్రాలు పొదిగిన గోల్డ్ మ్యూజికల్ నోట్స్ తో కూడిన బ్యాంగిల్ ను గిఫ్ట్ చేసి, ఆ సంద‌ర్భంగా తీసిన ఈ ఫోటో త‌న‌కు మోస్ట్ మెమొర‌బుల్ ఫోటో అని తెలిపారు.

గోల్డ్ షాపులో తాను వాటిని డిజైన్ చేస్తున్న‌ప్పుడు తీసిన వీడియో కూడా త‌న వ‌ద్ద ఉండాల‌ని, త్వ‌ర‌లోనే వెతికి ఆ వీడియోను, దానికి సంబంధించిన ఫోటోల‌ను కూడా పోస్ట్ చేస్తాన‌ని, అందరికీ వ‌ర‌ల్డ్ ఫోటోగ్ర‌ఫీ డే శుభాకాంక్ష‌లు తెలిపారు దేవీ. మొత్తానికి ఏదైనా స‌రే డిఫ‌రెంట్ గా చేసే దేవీలో ఉన్న ఈ హిడెన్ టాలెంట్ చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇక సినిమాల విష‌యానికొస్తే దేవీ శ్రీ ప్ర‌సాద్ ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా వ‌స్తోన్న ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Tags:    

Similar News