దేవీ కొత్త ఫేజ్‌లోకి ఎంటరైనట్టే!
టాలీవుడ్ లోని బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవీ శ్రీ ప్రసాద్ ఒకరు. గత కొన్నేళ్లుగా దేవీ శ్రీ ప్రసాద్ తన సంగీతంతో టాలీవుడ్ లో ముందుకు దూసుకెళ్తూ ఆడియన్స్ ను అలరిస్తున్నాడు.;
టాలీవుడ్ లోని బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవీ శ్రీ ప్రసాద్ ఒకరు. గత కొన్నేళ్లుగా దేవీ శ్రీ ప్రసాద్ తన సంగీతంతో టాలీవుడ్ లో ముందుకు దూసుకెళ్తూ ఆడియన్స్ ను అలరిస్తున్నాడు. యావరేజ్ సినిమాలను కూడా దేవీ తన మ్యూజిక్ తో హిట్‌లు, బ్లాక్ బస్లర్టుగా చేసిన సందర్భాలున్నాయి. దేవీ సాంగ్స్ ఎప్పటికీ ప్లే లిస్ట్‌ల్లో టాప్ లోనే ఉంటాయంటే ఆయన మ్యూజిక్ రేంజ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు.
అలాంటి దేవీ శ్రీ ప్రసాద్ గత కొన్ని సంవత్సరాలుగా మ్యూజిక్ పరంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాడు. పుష్ప తప్ప దేవీ నుంచి వచ్చిన సినిమాలకు పెద్దగా గుర్తింపు లభించలేదు. మధ్యలో వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలకు మంచి మ్యూజిక్ ఇచ్చినా ఆ మ్యూజిక్ దేవీ రేంజ్ కాదని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడు దేవీకి అనుకూలంగా పరిస్థితులు మారాయి.
పుష్ప2, తండేల్, కుబేర లాంటి పెద్ద సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుని దేవీ శ్రీ ప్రసాద్ మంచి కంబ్యాక్ ఇచ్చాడు. కుబేర సక్సెస్‌తో డీఎస్‌పీ మ్యూజికల్ హ్యాట్రిక్ అందుకున్నాడు. పుష్ప2తో సంచలనం సృష్టించిన దేవీ ఆ సినిమాతో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమాలో సాంగ్స్ తో పాటూ బీజీఎంను కూడా ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. దేవీ మ్యూజిక్ పుష్ప2 పై బజ్ ను పెంచడంలో కీలక పాత్ర పోషించింది.
ఆ తర్వాత వచ్చిన తండేల్ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం నెక్ట్స్ లెవెల్ లో ఉంది. తండేల్ సాంగ్స్ కు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టి మిక్డ్స్ టాక్ తో మొదలైన సినిమాను బ్లాక్ బస్టర్ చేశారు. తండేల్ పాటలు ఆడియన్స్ కు కనెక్ట్ అవడమే కాకుండా గతేడాది ఎక్కువగా విన్న ట్రాక్స్‌లో ఈ పాటలు కూడా ఉన్నాయి. ఇక తాజాగా దేవీ నుంచి కుబేర సినిమా వచ్చింది.
కుబేరకు అంతటా మంచి రివ్యూలు వచ్చాయి. ధనుష్, నాగార్జున పెర్ఫార్మెన్స్, శేఖర్ కమ్ముల దర్శకత్వం తో పాటూ, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి కూడా మాట్లాడుతూ, దేవీ మ్యూజిక్ సినిమాలోని ఎమోషన్స్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లిందని, సాంగ్స్ లిమిటెడ్ గా ఉన్నప్పటికీ, దేవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా స్పెషల్ గా ఉందని, సినిమాలోని ఎమోషన్ ను దేవీ మ్యూజిక్ సరిగ్గా క్యారీ చేసిందని దేవీని మెచ్చుకుంటున్నారు. ఈ మూడు సినిమాల కంటే ముందు DSP సూర్య సినిమా కంగువాకు వర్క్ చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ అందులో దేవీ మ్యూజిక్ కు మాత్రం మంచి ప్రశంసలే వచ్చాయి. ఏదేమైనా ఎంతోకాలంగా సంగీత ప్రియులు ఎదురుచూస్తోన్న దేవీ శ్రీ ప్రసాద్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడం అందరినీ ఆనందపరుస్తోంది. ఈ హ్యాట్రిక్ తో దేవీ ఇప్పుడు ఫ్లాపుల నుంచి కొత్త దశలోకి ఎంటరయ్యాడు. ప్రస్తుతం దేవీ చేతిలో పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటూ, గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు డెబ్యూ సినిమా జూనియర్ ఉన్నాయి.