• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేవర.. భైరా వస్తున్నాడు!

దేవర.. భైరా వస్తున్నాడు!

| సైఫ్ ఇందులో భైర అనే పాత్రలో నటిస్తున్నారు. అతనికి దేవర పాత్రకు ఒక ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంటుందట.

By - Tupaki Desk
Update: 2024-08-12 12:03 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న "దేవర" సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుండగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఇదివరకే సైఫ్ లుక్ విడుదల చేయగా, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్స్ రావాలి అంటే తప్పకుండా పాన్ ఇండియా రేంజ్ లో క్లిక్కవ్వాలి. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో మంచి డిమాండ్ రావాలి. ఎన్టీఆర్ RRR తో నార్త్ లో క్రేజ్ అందుకున్నప్పటికి అప్పుడు రాజమౌళి క్రేజ్ ఎక్కువగా యూజ్ అయ్యింది. ఇక ఇప్పుడు తారక్ సోలోగా తన స్టామినా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సైఫ్ అలీ ఖాన్ ద్వారా కూడా హిందీలో హైప్ పెంచేందుకు ఒక స్పెస్ అయితే ఉంది.

ఇక నార్త్ ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తు రిలీజ్ చేయబోయే రాబోయే అప్డేట్స్ చాలా కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆగస్టు 15న సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా, సినిమా యూనిట్ ఆయనకు సంబంధించిన ఓ అత్యంత క్రూరంగా ఉండే ఇంట్రో గ్లింప్స్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ వీడియోలో సైఫ్ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది.

సైఫ్ ఇందులో భైర అనే పాత్రలో నటిస్తున్నారు. అతనికి దేవర పాత్రకు ఒక ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంటుందట. ఈసారి కట్టుదిట్టమైన స్క్రీన్ ప్లే తో కొరటాల మంచి యాక్షన్ డోస్ ను ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొరటాల అసలు బలం ఆయన సినిమాలో పాత్రలే. ఇక వాటిలో ఉంటే కనెక్షన్ ను ఆయన పర్ఫెక్ట్ గా హైలెట్ చేయగలరు అని రుజువు చేశారు.

ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆయుధ పూజ సాంగ్ చిత్రీకరణ జరుగుతుండగా త్వరలోనే అప్డేట్ ఇవ్వాలని మరోవైపు మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే జెట్ స్పీడ్ లోనే మరో మాస్ సాంగ్‌ను కూడా చిత్రీకరించనున్నారు. సినిమా షూటింగ్ పూర్తి కాగానే, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మరింత బిజీ కానున్నారు. ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. ఇక "దేవర" మొదటి భాగం భారీ స్థాయిలో సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Tags:    
  • Devara 
  • Ntr 
  • Kortalasiva 
  • Janhvikapoor 
  • Filmindustry 
  • Rrrmovie 
  • Ssrajamouli 
  • Saifalikhan 
  • Bhaira 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS