• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేవర 1 కిల్లర్ లుక్.....

దేవర 1 కిల్లర్ లుక్.. వేటకు డేట్ ఫిక్స్

| తప్పకుండా సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని చాలాసార్లు వివరణ ఇచ్చారు.

By - Tupaki Desk
Update: 2024-02-16 11:47 GMT

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ దేవర పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందుతోంది. తప్పకుండా తారక్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడే విడుదల డేట్ పై కూడా చిత్ర యూనిట్ ఒక క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసింది.


తప్పకుండా సినిమాన ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని చాలాసార్లు వివరణ ఇచ్చారు. అయితే ఊహించని విధంగా సినిమా డేట్ మళ్ళీ మార్చాల్సి వచ్చింది. సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ కూడా ఇటీవల గాయం కారణంగా సినిమా షూటింగ్ కు కొంత బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక మరొక రిలీజ్ డేట్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారు అని ఇన్ని రోజులు ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.

అయితే విడుదల డేట్ పై చాలా రకాల గాసిప్స్ అయితే వచ్చాయి. ఇక మొత్తానికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మేకర్స్ విడుదల డేట్ పై క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించిన హై వోల్టేజ్ లుక్ కూడా ఒకటి విడుదల చేశారు. ఈ సినిమాను దసరా సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.

విజయదశమి ఫెస్టివల్ కూడా చాలా సినిమాలకు బాక్సాఫీస్ వద్ద కలిసి వచ్చింది. కాబట్టి ఈ సినిమాకు కూడా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఈ పోస్టర్లో చాలా పవర్ఫుల్ గా కనిపిస్తూ ఉన్నాడు. చిరుత పులిలా విలన్స్ పై దూకడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఆ లుక్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక బ్యాక్ గ్రౌండ్లో దైవకారంగా ఉన్న ఒక పెద్ద గుట్ట కూడా పోస్టర్లో హైలెట్ గా నిలిచింది.

మొత్తానికి దర్శకుడు కొరటాల శివ ప్రతీ పోస్టర్ తో కూడా సినిమాపై అంచనాల స్థాయిని అమాంతం పెంచేస్తూ ఉన్నాడు. తప్పకుండా సినిమా లో జూనియర్ ఎన్టీఆర్ పవర్ఫుల్ హీరోగా కనిపిస్తాడు అని అనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో యాక్షన్ ఫైట్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నట్లు సమాచారం. అలాగే పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Tags:    
  • Devara 
  • Jrntr 
  • Koratalasiva 
  • Anirudh 
  • Panindia 
  • Release 
  • Ntrarts 
  • Kalyanram 

Similar News

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

సినిమా ప్రొడక్షన్‌లో ఎగ్జిక్యూటివ్ నిర్మాత పాత్ర ప‌రిధి ఎంత‌?

2026-11-07 08:25 GMT

రాహా బర్త్‌డే స్పెషల్.. చిక్ లుక్‌తో ఆకట్టుకున్న అలియా భట్!

2026-11-07 08:23 GMT

నటుడిగా చివరి దశాబ్దం.. డైరెక్టర్ గా స్టార్ హీరో!

2026-11-07 08:22 GMT

Bigg Boss Telugu 10: ఈసారైనా జబర్దస్త్ నరేష్ దొరికిపోతాడా?

2026-11-07 08:20 GMT

చిరు 'లీక్స్' కాదు.. ఇప్పుడు ఫుల్ క్లారిటీ అవసరం!

2026-11-07 06:50 GMT

43 ఏళ్లలో కూడా తరగని అందం.. నెట్ సారీలో త్రిష అందాలు!

2026-11-07 06:47 GMT

Tupaki Exclusive : నాగార్జున ఎందుకు ప్రెజెంట్ చేశారు? అనీష్ ఓపెన్ చాట్

2026-11-07 06:12 GMT

Copyright @2026

Powered by Blink CMS