దేవర సెకండ్ హీరోయిన్ పై క్లారిటీ ఇవ్వరేంటి..?

మరాఠి భామ శృతి ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుందని టాక్. దేవర సినిమాలో సెకండ్ హీరోయిన్ పై చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రాలేదు.

Update: 2024-02-19 05:32 GMT

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న భారీ సినిమా దేవర. RRR తర్వాత తారక్ చేస్తున్న ఈ మూవీపై పాన్ ఇండియా కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్.టి.ఆర్ దేవర సినిమాలో డ్యుయల్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. ఒక లుక్ అయితే ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ అందించేందుకు సిద్ధం అవుతుండగా రెండో లుక్ కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని తెలుస్తుంది.

దేవర సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తుండగా అందుకు తగినట్టుగానే సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ ని తీసుకున్నారు. జాన్వి తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇదే. సౌత్ లో ఆమె చేస్తున్న మొదటి సినిమా కావడంతో దేవర మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక జాన్వి తో పాటుగా మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది.

మరాఠి భామ శృతి ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుందని టాక్. దేవర సినిమాలో సెకండ్ హీరోయిన్ పై చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రాలేదు. శృతి పేరు వినిపిస్తున్నా సరే మేకర్స్ మాత్రం ఆమె విషయంపై సైలెంట్ గా ఉన్నారు. మరోపక్క ఎన్.టి.ఆర్ దేవర సినిమా అక్టోబర్ కి వాయిదా పడటంపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 

రెండు భాగాలుగా వస్తున్న దేవర సినిమా మొదటి పార్ట్ అక్టోబర్ 10న రిలీజ్ లాక్ చేశారు. దసరా బరిలో తన స్టామినా చూపించేందుకు వస్తున్నాడు ఎన్.టి.ఆర్. అయితే RRR కోసం నాలుగేళ్లు ఎదురుచూసిన ఫ్యాన్స్ ఆ సినిమా వచ్చి రెండేళ్లు అవుతుండగా మళ్లీ ఇంకా దేవర కోసం ఎన్నాళ్లు వెయిట్ చేయాలనే ఆలోచనతో ఫ్యాన్స్ నిరుత్సాహంలో ఉన్నారు. అయితే ఫ్యాన్స్ ఎదురుచూపులకు తగినట్టుగానే సినిమా అంచనాలకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట కొరటాల శివ.

దేవర సినిమాలో యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ కు సూపర్ ట్రీట్ అందిస్తాయని చిత్ర యూనిట్ చెబుతున్నారు. సినిమాలో ఎన్.టి.ఆర్ ఉగ్రరూపం ఆడియన్స్ ని మెప్పిస్తుందని అంటున్నారు. సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కూడా నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ ఉందని టాక్. సినిమా ఖచ్చితంగా విజువల్ ఫీస్ట్ అందిస్తుందని అంటున్నారు. గ్రాఫిక్స్ వర్క్ కోసమే సినిమాను సమ్మర్ నుంచి అక్టోబర్ కి వాయిదా వేశారని టాక్. మొత్తానికి దేవర ఆడియన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

Tags:    

Similar News