హాఫ్‌ సెంచరీ.. 'దేవర' ఊచకోత షురూ

అక్టోబర్‌ 10న విడుదల అవ్వబోతున్న దేవర సినిమా యొక్క మొదటి పాట ఫియర్ సాంగ్ ను తాజాగా విడుదల చేసిన విషయం తెల్సిందే

Update: 2024-05-23 08:40 GMT

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్‌ మీడియాలో దేవర సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా కూడా వైరల్‌ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం.

అక్టోబర్‌ 10న విడుదల అవ్వబోతున్న దేవర సినిమా యొక్క మొదటి పాట ఫియర్ సాంగ్ ను తాజాగా విడుదల చేసిన విషయం తెల్సిందే. చాలా తక్కువ సమయంలోనే ఈ పాటకు ఏకంగా 50 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ట్రైలర్‌, టీజర్ ల స్థాయిలో పాటకు ఈ స్థాయి వ్యూస్ రావడం ఆశ్చర్యంగా ఉంది.

దేవర పాటకు వస్తున్న రెస్పాన్స్‌ చూసి అంతా షాక్ అవుతున్నారు. మొదట ఈ పాట గురించి కొందరు నెగటివ్‌ కామెంట్స్‌ చేశారు. ఇలా ఉందేంటి అన్నట్టు కొందరు పెదవి విరిచారు. అయితే వస్తున్న వ్యూస్ మాత్రం పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. తక్కువ సమయంలో 50 మిలియన్ ల వ్యూస్ రావడం రికార్డ్‌ బ్రేకింగ్‌ గా చెప్పుకోవచ్చు.

50 మిలియన్ ల వ్యూస్ తో దేవర సాంగ్‌ యూట్యూబ్‌ లో సాగిస్తున్న ఊచకోత ముందు ముందు మరింతగా ఉండే అవకాశం ఉంది అంటూ ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విడుదల తర్వాత కలెక్షన్స్ విషయంలో ఇలాంటి రికార్డ్‌ లు, ఊచకోత చూడబోతున్నాం అని వారు చెప్పుకొస్తున్నారు.

Read more!

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఆకట్టుకునే కథ మరియు కథనంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కి జోడీగా జాన్వీ కపూర్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.

అనిరుథ్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలువబోతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు మొదటి నుంచే చెబుతూ వస్తున్నారు. అన్నట్లుగానే మొదటి సింగిల్ కు మంచి స్పందన వచ్చి రికార్డ్‌ స్థాయి వ్యూస్‌ నమోదు అవుతున్నాయి.

Tags:    

Similar News