మామ్ అయ్యాకా దీపిక టూమచ్ స్టైల్ కంటెంట్
నిరంతర యోగా, జిమ్- డైట్ ప్లాన్ తో తన లుక్ ని మెయింటెయిన్ చేయడంలో దీపిక విఫలం కాలేదు.;
టూమచ్ స్టైల్ కంటెంట్ తో చంపడం ఎలానో ఈ మ్యారీడ్ బ్యూటీ ప్రత్యేకత! తనదైన అందం, రూపలావణ్యంతో, అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్ తో మతులు చెడగొట్టడంలో స్పెషలిస్ట్ గా పాపులరైంది డీపీ. బోల్డ్ ఫ్యాషన్ సెన్స్ కి కేరాఫ్ అని చెప్పాలి. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో ప్రత్యేకించి పరిచయం చేయాలా? ది గ్రేట్ దీపిక పదుకొనే గురించే ఇదంతా.
కెరీర్ ఆరంభం నుంచి గ్లామరస్ క్వీన్ గా వెలిగిపోతున్న దీపిక, ఎంపిక చేసుకున్న పాత్రల పరంగాను తనలోని సహజసిద్ధమైన చిలిపిదనం, అల్లరిని ప్రెజెంట్ చేయడంలో విఫలం కాలేదు. ప్రేమకథలు, రొమాంటిక్ కామెడీల్లో అద్భుత నటనతో ఆకట్టుకుంది. ఇటీవల పఠాన్ చిత్రంతో యాక్షన్ క్వీన్ గా స్టంట్స్ తో అదరగొట్టింది. రణ్ వీర్ ని పెళ్లాడి ఒక బిడ్డకు తల్లి అయినా, ఇప్పటికీ ఏజ్ లెస్ బ్యూటీగా తన లుక్ లో ఎలాంటి ఛేంజ్ లేదని నిరూపిస్తోంది.
నిరంతర యోగా, జిమ్- డైట్ ప్లాన్ తో తన లుక్ ని మెయింటెయిన్ చేయడంలో దీపిక విఫలం కాలేదు. మరోవైపు నిర్మాతగా, ఎంటర్ ప్రెన్యూర్ గా రాణిస్తున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీబిజీగా ఉంది. అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్ లో క్రేజీ మూవీలో నటిస్తున్న దీపిక తదుపరి ప్రభాస్ - నాగ్ అశ్విన్ జోడీతో కల్కి 2898 ఏడిలోను నటించనుంది. దీపికకు అంతర్జాతీయంగాను అసాధారణ క్రేజ్ ఉంది. టాలీవుడ్ ప్రాజెక్టుల కారణంగా ఇటీవల గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన కథానాయికగాను పాపులరైంది. కేన్స్ క్వీన్ గా, హాలీవుడ్ సినిమాల ప్రీమియర్లలో గెస్ట్ గాను అంతర్జాతీయంగా దీపిక పాపులరైంది.
భారతీయ ఫ్యాషన్ ప్రపంచంలో డీపీకి ఉన్న క్రేజ్, అంతర్జాతీయ అప్పీల్ దృష్ట్యా ప్రఖ్యాత లూయీస్ వీట్టన్ - గ్లోబల్ అంబాసిడర్ గాను ఎంపికైంది. లూయీస్ వీట్టన్ ప్రైజ్ 2025 జూరీ మెంబర్ గాను ప్రమోటైంది. ఈ సందర్భంగా స్పెషల్ ఫోటోషూట్ తో దీపిక హృదయాల్ని కొల్లగొట్టింది. దీపిక ప్రత్యేకించి డిజైన్ చేసిన లూయీస్ వీట్టన్ లెదర్ గౌన్ ధరించి, కాంబినేషన్ లెదర్ బ్యాగ్ తో డ్యాషింగ్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా లూయీస్ వీట్టన్ బ్రాండెడ్ లెదర్ బ్యాగ్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తోంది. ఇక లెదర్ తో రూపొందించిన డిజైనర్ కోట్, డిజైనర్ బాటమ్ తో దీపిక ఫ్యాషన్ పరంగా ప్రయోగాత్మక లుక్ తో అబ్బురపరిచింది.
`` విజేతలందరికీ అభినందనలు! ప్రపంచం మీ మాయాజాలాన్ని చూసే వరకు నేను వేచి ఉండలేను!`` అంటూ లూయీస్ వీట్టన్ బ్రాండ్ అంబాసిడర్ హోదాలో దీపిక సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోకి ఒక వ్యాఖ్యను కూడా జోడించింది. దీపిక లుక్ చూడగానే క్వీన్ అంటూ కొందరు అభిమానులు ప్రశంసించారు. మామ్ అయ్యాక ఇంకా అందంగా మారింది! అంటూ కొందరు కాంప్లిమెంట్ ఇచ్చారు. కొందరు పెళ్లి తర్వాతా డీపీ టూమచ్ స్టైల్ కంటెంట్‌తో చంపుతోందంటూ విస్మయం వ్యక్తం చేసారు.