దీపిక బర్త్ డే స్పెషల్.. తెలుగు ఫేవరెట్ హీరో ఎవరంటే?

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా భారీ పాపులారిటీ అందుకొని.. కెరియర్లో ఒక్కో మెట్టు ఎదుగుతూ నేడు టాప్ మోస్ట్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది దీపికా పదుకొనే.;

Update: 2026-01-05 19:30 GMT

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా భారీ పాపులారిటీ అందుకొని.. కెరియర్లో ఒక్కో మెట్టు ఎదుగుతూ నేడు టాప్ మోస్ట్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది దీపికా పదుకొనే. ఈరోజు ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 2006లో ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వం వహించిన కన్నడ సినిమా 'ఐశ్వర్య' ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా తెలుగు చిత్రం మన్మధుడుకి రీమేక్. ఇందులో ఉపేంద్ర హీరోగా నటించారు. ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది.

ఇక తర్వాత 2007లో ఓం శాంతి ఓం అనే సినిమా ద్వారా బాలీవుడ్ సినీ రంగ ప్రవేశం చేసింది. అక్కడ తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. ఏకంగా మూడు ఫిలింఫేర్ అవార్డులు దక్కించుకుంది. ఇకపోతే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకోవడమే కాకుండా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి 15 నుండి 20 కోట్లు తీసుకుంటున్న ఈమె బాలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా సినిమాలు చేస్తోంది.

అలా తొలిసారి కల్కి 2898 AD చిత్రంలో కనిపించింది. అక్కడ తన అద్భుతమైన నటనతో యాక్షన్ పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది దీపికా పదుకొనే. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వస్తున్న AA 22 xA6 అనే సినిమాలో నటిస్తోంది. హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సంస్థలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలుగు సినిమాలలో అవకాశాలు అందుకుంటున్న ఈమెకు.. తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరి కంటే ఆ హీరో అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే.. అర్జున్ కపూర్ హీరోగా, దీపికా పదుకొనే హీరోయిన్గా హోమీ అదాజానియా దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఫైండింగ్ ఫెనీ. ఈ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ కి వచ్చిన ఈమె టాలీవుడ్ లో తన ఫేవరెట్ హీరో గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది

ఆమె మాట్లాడుతూ.." తెలుగులో నాకు ఇష్టమైన హీరో మహేష్ బాబు. తెలుగు సినిమాలలో నటించాలని నేను గతంలో చాలా ఎదురు చూశాను. కానీ ఇప్పుడు అవకాశాలు వస్తున్నా.. నాకు సమయం లేక నటించడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం వరుసగా తెలుగులో అవకాశాలు అందుకోవడమే కాకుండా అందులో నటిస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది దీపిక పదుకొనే. ఇక దీపికా పదుకొనేకి మహేష్ బాబు ఇష్టమని తెలియడంతో అటు మహేష్ బాబు అభిమానులు కూడా ఈమెకు మద్దతుగా నిలుస్తున్నారు

Tags:    

Similar News