దీపిక గొంతెమ్మ కోర్కెలకు సందీప్ వంగా హర్ట్?
ప్రభాస్ `కల్కి 2898 ఏడి` కోసం సంప్రదించినప్పుడు నాగ్ అశ్విన్- అశ్వని దత్ బృందాన్ని ఇంత పెద్ద మొత్తం డిమాండ్ చేసిందన్న ప్రచారం సాగింది.;
స్టార్ హీరో అయిన తన భర్త కూడా సంపాదించలేనంత సంపాదిస్తోంది దీపిక పదుకొనే. ఒక్కో సినిమాకి 20కోట్ల పారితోషికం, అదనంగా లాభాల్లో వాటా కోరుతోందని గతంలో కథనాలొచ్చాయి. ప్రభాస్ `కల్కి 2898 ఏడి` కోసం సంప్రదించినప్పుడు నాగ్ అశ్విన్- అశ్వని దత్ బృందాన్ని ఇంత పెద్ద మొత్తం డిమాండ్ చేసిందన్న ప్రచారం సాగింది.
ఇప్పుడు మళ్లీ సేమ్ స్టోరీ రిపీటవుతోంది. మరోసారి ప్రభాస్ సరసన నటించే సినిమాకి దీపిక డిమాండ్లు కళ్లు భైర్లు కమ్మేలా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. సందీప్ వంగా దర్శకత్వం వహించనున్న `స్పిరిట్` కోసం సంప్రదించగా, దీపిక ఆమె టీమ్ నుంచి డిమాండ్లు షాకిచ్చాయని తెలుస్తోంది. స్పిరిట్‌లో నటించాలంటే దీపిక భారీ పారితోషికంతో పాటు, పెద్ద మొత్తంలో షేర్ ని డిమాండ్ చేసిందని, పైగా 8 గంటలు మాత్రమే పనికి కేటాయిస్తానని కండీషన్ పెట్టిందట. ఈ ఎనిమిది గంటల్లో సెట్స్ లో ఉండేది 6గంటలే. మిగలిన రెండు గంటలు ప్రయాణానికి సరిపోతుంది.
దీపిక, ఆమె టీమ్ పెడుతున్న కండీషన్స్ విన్న తర్వాత సందీప్ తీవ్రంగా హర్ట్ అయ్యాడని, అతడు దీపికను విడిచి పెట్టేందుకే సిద్ధమయ్యాడని గుసగుస వినిపిస్తోంది. దీపిక పదుకొనే తర్వాత మళ్లీ ఆ స్థానాన్ని భర్తీ చేసే నటి కోసం సీరియస్ గా వెతికే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.
నిజానికి ప్రభాస్- దీపిక కాంబినేషన్ కుదిరితే స్పిరిట్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందని అంతా భావించారు. కానీ అనుకున్నదొకటి అయినదొక్కటి. దీపిక ఇన్ని కండిషన్లు పెడుతోంది అంటే ఇతర ప్రాజెక్టులతో కమిట్ అవ్వడం ఒక కారణం.. అలాగే తన వారసుడు (బేబి బోయ్)తో ఎక్కువ సమయం గడపాలనే ఆలోచన డామినేట్ చేయడం మరో కారణం అంటూ విశ్లేషిస్తున్నారు. అయితే దీపికతో వాస్తవ సమస్య ఏమిటన్నది సందీప్ టీమ్ చెబుతుందేమో చూడాలి.