భ‌విష్య‌త్ లో సంక్రాంతి కూడా సాధార‌ణ సీజ‌న్ లా!

భ‌విష్య‌త్ లో సంక్రాంతి సీజ‌న్ కూడా ఇలాగే మారిపోతుంది? అన‌డంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు సినీ పండితులు. ఇప్ప‌టికే చాలా మంది హీరోలు సీజ‌న్ల‌తో ప‌ని లేకుండా సినిమాలు చేస్తున్నారు?;

Update: 2025-10-01 23:30 GMT

ఒక‌ప్పుడు ద‌సరా అంటే స్టార్ హీరోల సినిమా రిలీజ్ ల‌తో థియేట‌ర్లు క‌ళ‌క‌ళలాడేవి. స్టార్స్ అంతా ప్రత్యేకించి ఆ సీజ‌న్ కోసం పోటీ ప‌డేవారు. ముందుగానే డేట్లు లాక్ చేసి పెట్టుకునే వారు. పోటీగా ఎంత‌మంది స్టార్లు ఉన్నాస‌రే బొమ్మ ప‌డేల్సిందే. ఈ విష‌యంలో నిర్మాత‌లు కాంప్ర‌మైజ్ అయినా హీరోలు మాత్రం రాజీకి వ‌చ్చేవారు కాదు. అప్ప‌ట్లో అభిమానులు రిలీజ్ ల‌ను అంత పెస్ట్రిజీయ‌స్ గా తీసుకునే వారు. అభిమాన సంఘాల మాట‌ల‌కు అంతే ప్రాధాన్య‌త ఉండేది. మిగ‌తా పండ‌గ స‌మ‌యాల్లోనూ రెండు..మూడు రోజులు హాలీడేస్ క‌లిసొస్తాయి? అన్న‌ కోణంలో మ‌రి కొంత‌మంది స్టార్లు రిలీజ్ లు ప్లాన్ చేసుకునేవారు.

వెల వెల బోతున్న ద‌స‌రా:

కానీ ఇప్పుడా ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ద‌స‌రా పండుగ ఉత్సాహం మొద‌లైనా తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డా ఆ వైబ్ క‌నిపించ‌డం లేదు. ఈ ద‌స‌రా కూడా ఒక్క తెలుగు స్టార్ హీరో సినిమా రిలీజ్ కు లేదు. క‌న్న‌డ నుంచి రిష‌బ్ శెట్టి న‌టించిన `కాంతార చాప్ట‌ర్ వ‌న్` మిన‌హా మ‌రో సినిమా రిలీజ్ లేదు. క‌నీసం చిన్న సినిమా కూడా రిలీజ్ లో లేక‌పోవ‌డం శోచ‌నీయం. పెద్ద సినిమాలు లేక‌పోయినాప్ప‌టికీ చిన్న సినిమాలు కూడా రిలీజ్ కు లేవంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అద్దం ప‌డుతుంది. చిన్న సినిమాల నిర్మాణం భారీగా ప‌డిపోవ‌డంతోనే ఈ ప‌రిస్థితి త‌లెత్తింది.

సీనియ‌ర్ల‌తోనే సంక్రాంతి వైబ్:

భ‌విష్య‌త్ లో సంక్రాంతి సీజ‌న్ కూడా ఇలాగే మారిపోతుంది? అన‌డంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు సినీ పండితులు. ఇప్ప‌టికే చాలా మంది హీరోలు సీజ‌న్ల‌తో ప‌ని లేకుండా సినిమాలు చేస్తున్నారు? అన్న‌ది క్లియ‌ర్.

చిరంజీవి, బాల‌య్య‌, వెంకటేష్, నాగార్జున‌ లాంటి సీనియ‌ర్ హీరోలు మాత్రం సంక్రాంతికి రిలీజ్ ఉంటే బాగుంటుం ద‌ని పాత విధానంలో ఉన్నారు కాబ‌ట్టి ఆ సీజ‌న్లో వాళ్ల సినిమాలు క‌నిపిస్తున్నాయి. వాళ్లు కూడా వెన‌క్కి త‌గ్గారంటే సంక్రాంతి రిలీజ్ లు సున్నా.

ఓటీటీ ప్ర‌భావం ఓ కార‌ణం:

ప్ర‌భాస్ ,మ‌హేష్‌, రామ్ చ‌ర‌ణ్ , బ‌న్నీ , ఎన్టీఆర్ లాంటి పాన్ ఇండియా స్టార్లు ఎప్పుడో సంక్రాంతిని మ‌ర్చిపో యారు.ల‌క్కీగా అప్ప‌టికి సినిమాలు రెడీగా ఉంటే నిర్మాత సంక్రాంతి రిలీజ్ అంటూ డేట్ ఇస్తున్నారు. లేదంటే ఓటీటీ ఇచ్చిన స్లాట్ ప్ర‌కారం రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తున్నారు. ప్ర‌త్యేకంగా సంక్రాంతికే రిలీజ్ చేయాలి? అన్న ఉత్సాహ‌మైతే ఏ హీరోలోగానీ, నిర్మాత‌లో గానీ క‌నిపించ‌డం లేదన్న‌ది కాద‌న‌లేని నిజం.

Tags:    

Similar News