• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆర్తి అగ‌ర్వాల్‌లా లైపో...

ఆర్తి అగ‌ర్వాల్‌లా లైపో విక‌టించి..!

| వినోద‌రంగం నుంచి మరో విషాద వార్త వినాల్సి వచ్చింది. ప్రముఖ పాప్ సింగర్ సౌంద‌ర్య సాధ‌న చికిత్స విక‌టించి మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి

By - Tupaki Desk
Update: 2024-01-28 11:30 GMT

వినోద‌రంగం నుంచి మరో విషాద వార్త వినాల్సి వచ్చింది. ప్రముఖ పాప్ సింగర్ సౌంద‌ర్య సాధ‌న చికిత్స విక‌టించి మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ పాప్ స్టార్ డానీ లీ 42 ఏళ్ల వయసులో అనూహ్యంగా ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు. డానీ లీ ఇటీవలే లైపోసక్షన్ సర్జరీ చేయించుకోగా అది విక‌టించి మ‌ర‌ణించార‌ని చెబుతున్నారు. ఈ విషాద మ‌ర‌ణం ప్ర‌ముఖ టాలీవుడ్ హీరోయిన్ ఆర్తి అగ‌ర్వాల్ మర‌ణాన్ని గుర్తు చేసింది. దివ్య‌మైన తార ఆర్తి నాడు లైపో స‌క్స‌న్ చికిత్స విక‌టించ‌డం వ‌ల్ల మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఆర్తి త‌ర్వాత చాలా మంది సెల‌బ్రిటీలు లైపో విక‌టించి మ‌ర‌ణించిన వార్త‌లు క‌ల‌వ‌ర‌ప‌రిచాయి.

లైపో అంటే.. శరీరంలోని కొన్ని భాగాల నుండి అదనపు కొవ్వును తొలగించే శస్త్రచికిత్స. ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి ఇదొక టెక్నిక్. ఇందులో ముఖం, రొమ్ము, నడుము మొదలైన భాగాల నుండి అదనపు కొవ్వును తొలగించడం ద్వారా స్లిమ్ లుక్ సాధ్య‌మ‌వుతుంది. అయితే చికిత్స స‌మ‌యంలో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టి అది మ‌ర‌ణానికి దారి తీయ‌డం విషాదక‌రం.

ఊబ‌కాయం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు బ్రెజిలియ‌న్ పాప్ గాయ‌ని డానీ లీ లైపోసక్షన్ సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళార‌ని తెలిసింది. ఆ తర్వాత త‌న‌కు కొన్ని సమస్యలు వచ్చాయి. చికిత్స విక‌టించిన‌ కారణంగా జీవితాన్ని కోల్పోయారు. ప్రస్తుతం గాయని మృతికి అసలు కారణాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఒక కుమార్తెకు తల్లి

డానీ లీ వివాహం చేసుకుని సంతోషంగా ఉన్నారు. స‌ద‌రు గాయ‌నికి 7 సంవత్సరాల కుమార్తె కూడా ఉంది. కానీ ఇలాంటి పరిస్థితిలో ఆకస్మిక మరణం ఆ కుటుంబంలో విషాదం నింపింది. డానీ లీ మరణం తరువాత త‌న‌ కుటుంబం ఇటీవల ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటన ద్వారా సంతాపాన్ని తెలిపింది. అలాగే డానీ లీకి నివాళులు అర్పించాలని కోరుకునే అభిమానులందరికీ వేడుక నిర్వహించనున్నట్లు సమాచారం.

బ్రెజిలియన్ సంగీత ప్ర‌పంచంలో డానీ లీ పాపుల‌ర్ నేమ్. 5 సంవత్సరాల వయస్సులో పాడటం ప్రారంభించిన మేటి గాయ‌ని. Eu sou da Amazonia అంటే I am from the Amazon అనే పాటల‌తో గొప్ప‌ ప్రజాదరణ పొందారు.

Tags:    
  • Popsinger 
  • Dannylee 
  • Liposuctionsurgery 
  • Amazonia 
  • FIlmindustry 
  • Dannyleedeath 

Similar News

నాగ‌చైత‌న్య `వృషకర్మ`కు ఆ ఇద్ద‌రూ పోటీనా?

2026-11-07 04:06 GMT

ఔత్సాహిక న‌టీమ‌ణుల‌కు ఈ న‌టి జ‌ర్నీ ప‌ర్ఫెక్ట్ కేస్ స్ట‌డీ

2026-11-07 04:04 GMT

ఓం రౌత్‌ని ప‌దే పదే టార్గెట్ చేస్తున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్

2026-11-07 04:03 GMT

థియేట‌ర్ల వ్యాపారంలో స్టార్ హీరో 600 కోట్లు పెట్టుబ‌డి!

2026-11-07 04:02 GMT

సిద్ శ్రీరామ్.. ఒకప్పటి డిమాండ్ ఇప్పుడు ఏదీ!

2026-11-07 04:01 GMT

కాజల్‌ ఉండగా.. సాయిపల్లవి కోసం ఆరాటమా?

2026-11-07 04:00 GMT

సీనియర్ ఎన్టీఆర్ వల్లే జీవితంలో ఆ కీలకమైన పని చేసిన మురళి మోహన్..!

2026-11-07 03:51 GMT

లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకోవడం టాలీవుడ్‌లో ఒక శాపమా..?

2026-11-07 02:43 GMT

స్టార్ హీరో షూటింగ్ కోసం క్రికెట్ మ్యాచ్‌లు ఆపేసార‌ట‌..అదెట్టా?

2026-11-07 02:42 GMT

చిరు, నాగ్ స్టెప్పులు.. నాగచైతన్య లైఫ్ పై సీరియస్.. MegaVerse లో ఏం జరిగిందంటే..!

2026-11-07 02:41 GMT

లిప్ సింకుకి త‌గ్గ‌ట్టు డ‌బ్బింగ్ మాట‌లు రాయ‌డం ఎలా?

2026-11-07 02:30 GMT

రణ్‌బీర్ వల్ల కన్నీళ్లు పెట్టుకున్న ఆలియా భట్ నాన్న.. ఎందుకంటే?

2026-11-07 02:11 GMT

Copyright @2026

Powered by Blink CMS