షాకింగ్ ట్విస్ట్: ప‌రిశోధ‌కుడిని చంపేసిన అమ్మో బొమ్మ‌

నిర్జీవ‌మైన ఒక బొమ్మ‌కు ప్రాణం వ‌స్తుంది. అది మ‌నుషుల‌తో క‌లిసిపోయి చాలా వేషాలు వేస్తుంది.;

Update: 2025-07-17 06:30 GMT

నిర్జీవ‌మైన ఒక బొమ్మ‌కు ప్రాణం వ‌స్తుంది. అది మ‌నుషుల‌తో క‌లిసిపోయి చాలా వేషాలు వేస్తుంది. ఆ బొమ్మ దెయ్యంలా వికృతంగా మారుతుంది.. ఝ‌డిపిస్తుంది. దీనికి తోడు చుట్టూ ప‌రిస‌రాల్లో పారా నార్మ‌ల్ యాక్టివిటీ. ఆత్మ‌లు ఉన్నాయా లేవా? అంటూ ప‌రిశోధించే వ్య‌క్తులు.. వింటుంటే క‌చ్ఛితంగా ఇదేదో సినిమా క‌థే అని అనుకుంటారు.

బ్లాక్ బ‌స్ట‌ర్ హార‌ర్ ఫ్రాంఛైజీ 'అన్నా బెల్లి' గురించి విన‌ని వారు ఉండ‌రు. బొమ్మ దెయ్యంగా మారి ద‌డ పుట్టిస్తుంది. ఝ‌డిపించి చంపుతుంది. అలాగే ఆత్మ‌లు ఉన్నాయి.. ఇండ్ల‌లో వాటి ప్ర‌వ‌ర్త‌న విచిత్రంగా ఉంటుంది.. వాటితో మాట్లాడ‌గ‌లం.. అవి మ‌న‌ల్ని చూస్తాయి.. మాట‌లు వింటాయి! అని నిరూపిస్తూ `పారా నార్మ‌ల్ యాక్టివిటీ` సినిమాలు కూడా పుట్టుకొచ్చాయి. అయితే ఇప్పుడు అన్నా బెల్లి గురించి, పారా నార్మ‌ల్ యాక్టివిటీ సినిమాల గురించి ప్ర‌స్థావించ‌డానికి కార‌ణం లేక‌పోలేదు.

ఇటీవ‌ల అమెరికా- పెన్సిల్వేనియాలోని గెట్టిస్‌బర్గ్‌లో అన్నాబెల్లె బొమ్మతో పర్యటిస్తున్నప్పుడు పాపుల‌ర్ పారానార్మల్ పరిశోధకుడు డాన్ రివెరా మరణించాడని ఈ పర్యటన నిర్వాహకులు ధృవీకరించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. డాన్ రివెరా అమెరికా ఆర్మీ అనుభవజ్ఞుడు.. న్యూ ఇంగ్లాండ్ సొసైటీ ఫర్ సైకిక్ రీసెర్చ్ (NESPR)లో ప్రధాన పరిశోధకుడు. అతడు ప్ర‌స్తుతం తన `డెవిల్స్ ఆన్ ది రన్ టూర్` మధ్యలో ఉన్నాడు. అత‌డిని అత్య‌వ‌స‌రంగా ఓసారి హోట‌ల్ కి పిలిచింది ప‌ర్యాట‌క బృందం. కానీ అత‌డు టూర్ మ‌ధ్య‌లోనే అప‌స్మార‌క స్థితిలో క‌నిపించాడు. దీంతో వెంట‌నే సీపీఆర్‌తో అతడిని బతికించడానికి ప్రయత్నాలు చేసినా ఫ‌లించ‌లేదు.

అత‌డు సంఘటనా స్థలంలోనే మరణించాడు. ఈ మరణానికి క‌చ్చితమైన కారణం ఇంకా తెలియలేదని న్యూయార్క్ పోస్ట్ త‌న క‌థ‌నంలో పేర్కొంది. ట్రావెల్ ఛానల్ `మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్` సహా పారానార్మల్ టెలివిజన్ షోలలో కనిపించిన రివేరా నెట్‌ఫ్లిక్స్ '28 డేస్ హాంటెడ్'ను నిర్మాత‌గాను పాపుల‌ర‌య్యాడు. పారానార్మల్ లెజెండ్స్ ద్వారా ప్రసిద్ధి చెందిన హాంటెడ్ బొమ్మ అన్నాబెల్లెను ప్రదర్శించడానికి అతడు NESPR సభ్యులతో కలిసి పర్యటిస్తున్నాడు. గెట్టిస్ బ‌ర్గ్ లో టూర్ లో ఉండ‌తా అత‌డు మ‌ర‌ణించాడు. రివేరా సోష‌ల్ మీడియాల్లో పారానార్మ‌ల్ క‌థ‌ల‌ను షేర్ చేస్తుంటాడు.

అన్నాబెల్లె 1970ల నాటి కథలతో ద‌డ పుట్టించే ఫ్రాంఛైజీ. బొమ్మ దెయ్యం ప‌ట్టిన‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తుంది. ఇది నిజ జీవిత క‌థ‌ల ప్రేర‌ణ‌తో రూపొందించిన సిరీస్. ది కాంజురింగ్ సిరీస్ ఈ త‌ర‌హాలో ర‌క్తి క‌ట్టించింది.

Tags:    

Similar News