బొడ్డుపై పండ్లు, సలాడ్‌లు వేసారు.. నటి సంచలన వ్యాఖ్యలు!
ఇప్పుడు డైసీ షా ఇంచుమించు అలాంటి వ్యాఖ్యలే చేసింది. అయితే ఈసారి కన్నడ సినీపరిశ్రమ వ్యామోహం గురించి డైసీ షా మాట్లాడింది.;
కొన్నేళ్ల క్రితం దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావుపై తీవ్ర ఆరోపణలు చేసింది తాప్సీ పన్ను. ఝుమ్మందినాదం సినిమాతో వెండితెరకు పరిచయమైనప్పుడు తన నాభి (బొడ్డు)పై పూలు, పండ్లు వేసారని ఆరోపించింది తాప్సీ. నాభి అందాలను కెమెరాలో చిత్రీకరించారని, తనను అలా చూపించడం అసాధారణంగా అనిపించిందని వ్యాఖ్యానించింది తాప్సీ. టాలీవుడ్ నుంచి ఆల్మోస్ట్ నిష్కృమించిన తర్వాత తాప్సీ కామెంట్లు పెను దుమారం రేపాయి. ఏరు దాటాక తెప్ప తగలేసిందని విమర్శలొచ్చాయి. అవకాశం ఇచ్చినప్పుడు ఇలాంటి కామెంట్లు చేయని తాప్సీ పూర్తిగా టాలీవుడ్ వదిలి వెళ్లాక ఆరోపించడం అందరినీ షాక్ కి గురి చేసింది.
ఇప్పుడు డైసీ షా ఇంచుమించు అలాంటి వ్యాఖ్యలే చేసింది. అయితే ఈసారి కన్నడ సినీపరిశ్రమ వ్యామోహం గురించి డైసీ షా మాట్లాడింది. తన బొడ్డు (నాభి)పై పండ్లు, సలాడ్లు వేసారని డైసీ షా వ్యాఖ్యానించింది. అది తనకు అసౌకర్యంగా ఇబ్బందిగా అనిపించిందని తెలిపింది. కన్నడిగులకు నాభి అందాల ప్రదర్శన అంటే పిచ్చి వ్యామోహం ఉందని వ్యాఖ్యానించింది. మహిళలను అలా చూడటం మగాళ్లకు సంతృప్తినిస్తుందని కూడా డైసీ షా వ్యాఖ్యానించింది. మేల్ ఫాంటసీలో స్త్రీలను ఉపయోగించుకుంటారని, కన్నడ సినిమాలు చేస్తున్నప్పుడు తనకు ఇలాంటి అనుభవాలయ్యాయని తెలిపింది.
అయితే డైసీ షా వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో భిన్నవాదనలు వినిపించాయి. కొందరు ఇలాంటి చిత్రీకరణలు సరికాదని వ్యాఖ్యానించారు. పాత పద్ధతులను విడనాడి మహిళల పాత్రలను గౌరవప్రదంగా ప్రదర్శించాల్సిన అవసరాన్ని గుర్తు చేసారు. మునుపటితో పోలిస్తే ఇప్పుడు పద్ధతులు మారాయి. సినిమాల్లో మహిళల పాత్రలను ప్రదర్శిస్తున్న తీరు మారింది. ఇంకా కె.రాఘవేంద్రరావు రోజులు అయితే లేవు. ఇప్పుడు కథానాయకులకు ధీటుగా స్టంట్స్ కూడా చేస్తున్నరు. అందువల్ల డైసీ షా కానీ, తాప్సీ కానీ అలాంటి ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ఆస్కారం లేదు. కాలంతో పాటే మార్పు! దానిని ఇప్పటి కథానాయికలు స్పష్ఠంగా చూస్తున్నారు.