సెన్సార్ పూర్తి చేసుకున్న అడివి శేష్ డెకాయిట్.. నిడివి ఎంతంటే?

పలుమార్ల వాయిదా తరువాత ఇప్పుడు ఎట్టకేలకు విడుదలకు సిద్ధమయ్యింది డెకాయిట్ మూవీ.;

Update: 2026-04-07 14:00 GMT

పలుమార్ల వాయిదా తరువాత ఇప్పుడు ఎట్టకేలకు విడుదలకు సిద్ధమయ్యింది డెకాయిట్ మూవీ. ప్రముఖ టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, అందాల సుందరి మృణాల్ ఠాకూర్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ రివేంజ్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10 2026న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదలకు కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక విడుదలకు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది ఈ సినిమా.

సెన్సార్ పూర్తి చేసుకున్న డెకాయిట్..

ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ జారీ చేసింది . యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రానికి.. 2 గంటల 32 నిమిషాలుగా నిడివిని లాక్ చేశారు. ఉత్కంఠ భరితమైన కథాంశంతో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా ఒక సరికొత్త సినిమాటిక్ అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో అనురాగ్ కశ్యప్ , ప్రకాష్ రాజ్ , సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మేనకోడలు జైన్ మేరీ ఖాన్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది . ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లలో తన అందంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది కూడా..

అభ్యంతరాలు వ్యక్తం చేసిన సెన్సార్ సభ్యులు..

ఇకపోతే సెన్సార్ సభ్యులు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే మరికొన్ని సన్నివేశాలలో డైలాగ్స్ పై వివరణ కూడా కోరారట.ఇక సెన్సార్ అధికారుల ప్రశ్నలకు చిత్ర బృందం కొన్ని మార్పులు చేర్పులు చేసి డైలాగ్స్ విషయంలో వివరణ ఇచ్చి సెన్సార్ అధికారులను సంతృప్తి పరిచినట్లు తెలుస్తోంది.

సెన్సార్ సభ్యుల ఫస్ట్ రివ్యూ..

ఇకపోతే హరి (అడివి శేష్), జూలియట్ (మృణాల్ ఠాకూర్) ప్రేమించుకుంటారు. పైగా జీవితంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని వాగ్దానం చేసుకుంటారు. అయితే తాము ఒకటి అనుకుంటే విధి మరొకటి తలవడంతో ఇద్దరు విడిపోతారు. ఆ తర్వాత హరి దుబాయ్ కి వెళ్ళిపోతారు. మరి హరి దుబాయ్ ఎందుకు వెళ్లారు? జూలియట్ కి కోటి రూపాయలు అవసరం ఎందుకు వచ్చింది? పోలీసులు జూలీయట్ ను, హరిని ఎందుకు వెంటాడతారు? హరి ,జూలియట్ తమ కుటుంబంలోకి చిన్నారి జూలియట్ రావాలని కన్న కలలు నిజమయ్యాయా? ఇద్దరు చేసుకున్న వాగ్దానాలు, కోరిక మేరకు చివరి వరకు కలిసి ఉన్నారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే డెకాయిట్ సినిమా చూడాల్సిందే.

Tags:    

Similar News