• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జ్యోతిక 'డబ్బా కార్టెల్'...

జ్యోతిక 'డబ్బా కార్టెల్' వెబ్ సిరీస్.. టీజర్ ఎలా ఉందంటే?

| ఓటీటీ లవర్స్ అంతా సిరీస్ కోసం వెయిట్ చేస్తుండగా.. తాజాగా టీజర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

By - Tupaki Desk
Update: 2025-01-31 08:31 GMT

స్టార్ నటీమణులు షబానా అజ్మీ, జ్యోతిక నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ డబ్బా కార్జెల్. హితేష్ భాటియా దర్శకత్వం వహిస్తున్న ఆ సిరీస్.. త్వరలోనే నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల కానుంది. షాలిని పాండే సహా పలువురు నటిస్తున్న సిరీస్ ను ఎక్సెల్ మీడియా, ఎంటర్టైన్మెంట్ LLP బ్యానర్లపై రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఓటీటీ లవర్స్ అంతా సిరీస్ కోసం వెయిట్ చేస్తుండగా.. తాజాగా టీజర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఐదుగురు మధ్యతరగతి మహిళలతో పాటు వారి కుటుంబాలు డ్రగ్స్ ట్రాఫికింగ్ వ్యాపారంలో చిక్కుకున్న తర్వాత జీవితాల్లో ఏం జరిగిందనే కథ ఆధారంగా సిరీస్ రూపొందుతున్నట్లు టీజర్ ద్వారా క్లియర్ గా తెలుస్తోంది.

టీజర్‌ లో ఏముంది?.. ముంబైకి పొరుగున ఉన్న పట్టణమైన థానేలో కొందరు మధ్య తరగతి మహిళలు డబ్బాల సర్వీస్ నడుపుతుంటారు. ఇంట్లో వంట చేసి టిఫిన్ బాక్సుల్లో ఖాతాదారులకు అందిస్తుంటారు. ఆ సర్వీస్ ముసుగులో డ్రగ్స్ డెలివరీ చేస్తుంటారు. ఆ టీమ్ కు లీడర్ గా షబానా అజ్మీ వ్యవహరిస్తుంటారు.

ఆ తర్వాత డబ్బా సర్వీస్ ద్వారా డ్రగ్స్ తరలిస్తున్న విషయం తెలిసిపోయి వారి జీవితాలు చిక్కుల్లో పడతాయి. దీంతో వారంతా కలిసి పోరాడుతారు. మరి వాళ్లు తమ సమస్య నుంచి తప్పించుకోగలిగారా లేదా వారు ఆ విషయం ప్రమాదకరమైన లోతుల్లోకి వెళ్లిపోయారా అనేది డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ గా తెలుస్తుంది.

అయితే క్యాస్టింగ్ అంతా తమ పాత్రల్లో ఒదిపోయినట్లు కనిపిస్తున్నారు. టాలెంటెడ్ టీమ్ ను మేకర్స్ తీసుకున్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. వారు టీజర్ ను కూడా అద్భుతంగా కట్ చేశారు. ఆకర్షణీయమైన విజువల్స్, ఆసక్తికరమైన కథాంశం.. సిరీస్ పై అంచనాలు పెంచుతోంది. గ్రిప్పింగ్ క్రైమ్ డ్రామా గా సిరీస్ అందరినీ మెప్పించడం గ్యారెంటీ అని అంతా అంచనా వేస్తున్నారు.

దీంతో సిరీస్ కోసం వెయిటింగ్ అంటూ నెటిజన్లు.. నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. ఫిబ్రవరి 28న సిరీస్ విడుదల కానుండగా.. టీజర్ ఇప్పుడు భారీ అంచనాలు క్రియేట్ చేసిందనే చెప్పాలి. మరి డబ్బా కార్టెల్ సిరీస్.. ఎలా ఉంటుందో.. ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో వేచి చూడాలి.

Full View
Tags:    
  • DabbaCartel 
  • NetflixIndia 
  • Farhanakthar 
  • ShabanaAzmi 
  • Jyothika 
  • ShaliniPandey 
  • CrimeDrama 
  • BollywoodFilms 
  • HiteshBhatia 
  • OTTPlatform 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS