• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కోర్ట్ కలెక్షన్స్.. 9...

కోర్ట్ కలెక్షన్స్.. 9 రోజుల్లో ఎంత వచ్చాయంటే?

| త్వరలోనే రూ.50 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఓ కోర్ట్ రూమ్ డ్రామా మూవీకి ఇంత ఆదరణ రావడం తెలుగులో ఇదే మొదటిసారి అన్నట్టు అనిపిస్తోంది.

By - Tupaki Desk
Update: 2025-03-23 04:55 GMT

కంటెంట్ బేస్డ్ సినిమాలకి తెలుగులో ఉన్న స్థానం మరింత పెరిగిందనెందుకు కోర్ట్ సినిమా ఒక ఉదాహరణగా నిలిచింది. ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి, శివాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా సినిమా విడుదలైన మొదటి రోజునుంచే అంచనాలను బీట్ చేస్తూ మంచి రన్ కొనసాగిస్తోంది. స్టార్ హీరో లేకపోయినా, భారీ ప్రొమోషన్లు లేకపోయినా కేవలం కథనంతోనే ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రానికి ప్రెజెంటర్‌గా వ్యవహరించగా, దర్శకుడు రామ్ జగదీష్ ఈ సినిమాను ఎంతో నమ్మకంగా రూపొందించాడు.

ఇప్పటి వరకూ వచ్చిన కోర్ట్ రూమ్ డ్రామాలతో పోలిస్తే ఈ సినిమా వేరే లెవెల్‌లో నిలిచింది. ప్రేక్షకులకు న్యాయ వ్యవస్థపై ఓ ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడేలా సినిమా కథనం రూపొందించబడింది. ముఖ్యంగా చిన్న చిన్న పాత్రల్లోనూ మ్యూచువల్ కనెక్ట్ ఉండడం, ఎక్కడా బోరింగ్ అనిపించకుండా కథను ఆసక్తి నడిపించడం సినిమాకు ప్లస్ అయ్యాయి. మొదటి షో నుంచే వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్ కంటిన్యూ అవుతూ బాక్సాఫీస్ రేంజ్‌ను పెంచుతోంది.

లేటెస్ట్ గా ఈ సినిమా తొమ్మిదో రోజున కూడా అదే ఊపులో కొనసాగింది. 9వ రోజున రూ.4.50 కోట్లు గ్రాస్ వసూలు చేయడం విశేషం. సాధారణంగా చిన్న సినిమాలకు విడుదలైన వారాంతం తర్వాత కాస్త తగ్గుదల వస్తుంది. కానీ ‘కోర్ట్’ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా మరింత పెరుగుతున్న కలెక్షన్లతో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. సెలవు రోజు కావడంతో 10వ రోజున ఇంకా పెద్ద రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇప్పటి వరకూ ‘కోర్ట్’ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.46.80 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. చిన్న సినిమాగా వచ్చి, ఓవర్సీస్‌లోనూ $900K మార్క్ దాటి మిలియన్ దిశగా దూసుకెళ్తున్న ఈ సినిమా, త్వరలోనే రూ.50 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఓ కోర్ట్ రూమ్ డ్రామా మూవీకి ఇంత ఆదరణ రావడం తెలుగులో ఇదే మొదటిసారి అన్నట్టు అనిపిస్తోంది.

ఈ విజయంతో రామ్ జగదీష్ అనే కొత్త దర్శకుడికి మంచి గుర్తింపు వచ్చింది. నాని నెమ్మదిగా కానీ నిరంతరం కంటెంట్ బేస్డ్ సినిమాలకు తోడుగా నిలుస్తూ చిన్న సినిమాలకు పెద్ద విజయాలు అందిస్తున్నారు. కోర్ట్ సినిమాతో తాను ఎన్నుకున్న ప్రాజెక్ట్ ఎంత కరెక్ట్ అనిపించిందో మరోసారి నిరూపించుకున్నారు. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు సక్సెస్ అవుతూ ఉంటే.. టాలీవుడ్‌లోకి మరిన్ని ప్రయోగాత్మకమైన సినిమాలు వస్తాయని చెప్పవచ్చు.

Tags:    
  • CourtMovieSuccess 
  • ContentBasedCinema 
  • TeluguCinema 
  • NaturalStarNani 
  • RamJagadeesh 
  • BoxOfficeHit 
  • TeluguFilmIndustry 

Similar News

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS