'జ్ఞాపకాలుగా మారడమే జీవితం'.. కపుల్ ఫ్రెండ్లీ టీజర్

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లిస్ట్ లో సంతోష్ శోభన్ పేరు కూడా ఉంటుందన్న విషయం తెలిసిందే.;

Update: 2025-08-09 04:31 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లిస్ట్ లో సంతోష్ శోభన్ పేరు కూడా ఉంటుందన్న విషయం తెలిసిందే. గోల్కొండ హై స్కూల్ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సంతోష్.. ఇప్పుడు వరకు కెరీర్ లో హీరోగా మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ సరైన హిట్ ను సొంతం చేసుకోలేకపోతున్నారు.


చివరగా.. ప్రేమ్ కమార్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంతోష్ శోభన్ ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ చిత్రంతో థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీతో రూపొందుతున్న ఆ సినిమాలో యంగ్ బ్యూటీ మానస వారణాసి హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు.

అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కపుల్ ఫ్రెండ్లీ మూవీని యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా రూపొందిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు మేకర్స్.

అయితే తాజాగా టీజర్ ను రిలీజ్ చేయగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో అది వైరల్ గా మారింది. సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. యూత్ కు బాగా కనెక్ట్ అవుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని, రియాలిటీకి దగ్గరగా సినిమా తీస్తున్నట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తోందని నెటిజన్లు చెబుతున్నారు.

టీజర్ ప్రకారం, 'నెల్లూరుకు చెందిన యువకుడు శివ (సంతోష్ శోభన్) ఇంటీరియర్ డిజైనింగ్ చేసి సరైన ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతుంటాడు. ఖర్చుల కోసం చెన్నై సిటీలో బైక్ పూలింగ్ చేస్తుంటాడు. ఆ సమయంలో ఓ సారి ప్రీతి (మానస వారణాసి) శివ బైక్ పై జర్నీ చేస్తుంది. ఆ సమయంలో అపరిచితులుగా పరిచయమై ప్రేమలో పడతారు.

అయితే హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్స్ తో టీజర్ ఆసక్తికరంగా సాగింది. బ్యాక్ గ్రౌండ్ లో 'స్పార్క్స్ ఇన్ యువర్ ఐస్, దే షైన్..' అంటూ సాగే బిట్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. 'ఒకప్పటి సాధారణ క్షణాలన్నీ జ్ఞాపకాలుగా మారడమే జీవితం' అంటూ టీజర్ చివరకు వేసిన క్యాప్షన్ అదిరిపోయిందనే సినీ ప్రియులు చెబుతున్నారు.. ఓవరాల్ గా టీజర్.. సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

Full View
Tags:    

Similar News