వార్ 2 vs కూలీ.. బుకింగ్స్ లో అప్పర్ హ్యాండ్ ఎవరిది?
అయితే రెండు సినిమాలపై భారీ అంచనలా ఉండడంతో టికెట్ సేల్స్ జోరగా సాగుతున్నాయి.;
మరో మూడు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద జాతర ప్రారంభం కానుంది. ఆగస్టు 14న రజనీకాంత్ కూలీ, ఎన్టీఆర్- హృతిక్ రోషన్ వార్ 2 సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఒకే రోజు రెండు భారీ సినిమాలు థియేటర్లలోకి రావడం సినీప్రియులకు ఫుల్ హైప్ ఇస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాల ఓవర్సీస్ బుకింగ్స్ ఎప్పుడో ప్రారంభం కాగా, తాజాగా ఇండియాలోనూ సేల్స్ షురూ అయ్యాయి.
అయితే రెండు సినిమాలపై భారీ అంచనలా ఉండడంతో టికెట్ సేల్స్ జోరగా సాగుతున్నాయి. కానీ, ఈ రేసులో రజనీకాంత్ కూలీదే పైచేయిగా కనిపిస్తుంది. ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో లెక్కల ప్రకారం.. కూలీ సినిమా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో 1 మిలియన్ దాటేసింది. ఇండియన్, ఓవర్సీస్ సేల్స్ కలుపుకొని కూలీ రిలీజ్ కు మూడు రోజుల ముందే వన్ మినియన్ మార్క్ దాటేసింది.
ఇదే సమయంలో వార్ 2 అనుకున రేంజ్ లో పర్ఫార్మెన్స్ చూపించడం లేదు. హైప్ వల్లనో, ఇంకా ఏవైనా రీజన్స్ ఉన్నాయో తెలీదు కానీ.. వార్ 2 సినిమా ఇప్పటివరకు ప్రీ సేల్స్ లో ఇంకా 66K దగ్గరే ఉంది. ఈ లెక్కన కూలీ- వార్ 2 ప్రీ సేల్స్ లో చాలా తేడా ఉంది. ఇందులో కూలీ అప్పర్ హ్యాండ్ క్లీయర్ గా కనిపిస్తుంది.
అలాగే దేశవ్యాప్తంగా 10 ప్రధాన నగరాల్లో ఓపెనింగ్ డే అడ్వాన్ బుకింగ్స్ తీసుకుంటే.. ఇందులోనూ కూలీదే హవా సాగుతోంది. హైదరాబాద్, చెన్నై, ముంబయి, బెంగళూరు లాంటి మెట్రో సిటీల్లో కూలీ మంచి ప్రదర్శన కనబరుస్తుంది. ఓపెనింగ్ బుకింగ్స్ లో కూలీ రూ రూ.7.9 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. అటు వార్ 2 మాత్రం ఓపెనింగ్ డే బుకింగ్స్ లో రూ.2.5 కోట్లే కలెక్షన్ చేసింది. ఇలా ఓవరాల్ గా చూసుకుంటే కూలీదే వార్ 2 పై అప్పర్ హ్యాండ్ గా కనిపిస్తుంది.
అయితే ఈ లెక్కలు ప్రస్తుతం ఉన్న గణాంకాలే. సినిమా రిలీజ్ కు ఇంకా మూడు రోజులు ఉంది. దీంతో బుకింగ్స్ మరింత జోరు అందుకోవడం పక్కా. కూలీ ఓపెనింగ్ డే లో ఈ ప్రధాన 10 నగరాల్లోనే రూ.10 కోట్లు దాటే ఛాన్స్ ఉంది. అటు వార్ 2 బుకింగ్స్ తాజాగా ప్రారంభం అవ్వగా.. ఇంకా బుకింగ్స్ పెరిగే ఛాన్స్ ఉంది.
కాగా, కూలీని లోకేశ్ కగనరాజ్ తెరకెక్కించగా అక్కినేని నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంగ్ర ప్రధాన పాత్రలు పోషించారు. శ్రుతి హాసన్ ఫీమేల్ లీడ్ లో నటిచింది. మరోవైపు వార్ 2 సినిమాకు ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. కియారా అద్వాణీ హీరోయిన్ గా నటించింది.