నాగ్, ఆమిర్ కాదు.. కూలీలో ఈ ఇద్దరు నెక్ట్స్ లెవెల్

సింపుల్ గా కనిపించి సడెన్ గా షేడ్స్ మారిపోయే పాత్రలో రచిత రామ్ అదరగొట్టిందనే చెప్పాలి. అయితే ట్విస్ట్ లు ఇప్పుడు చెప్పి స్పాయిలర్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు.;

Update: 2025-08-15 10:59 GMT

రజనీకాంత్ కూలీ సినిమాలో నలుగురు బడా స్టార్ నటులు ఉన్నారు. రజనీకాంత్, అక్కినేని నాగార్జున, బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్, కన్నడ హీరో ఉపేంద్ర. అయితే వీళ్ల నలుగురి కంటే సినిమాలో మరో ఇద్దరి పాత్రలు మాత్రం బాగా పండాయి. అవే సౌబిన్ సాహిర్, రచిత రామ్ పాత్రలు. వీళ్లకు పాత్రల పరంగా ఎక్కువ స్కోప్ దక్కింది. రన్ టైమ్, ట్విస్టులు కూడా వీళ్లపై ఎక్కువే ఉన్నాయి.

 

మలయాళ సినిమా మంజుమ్మెల్ బాయ్స్ సినిమాతో సౌబిన్ సాహిర్ దగ్గరయ్యారు. అయితే ఈయనకు టాలెంట్ లో లోటు లేదు. చిన్న చిన్న బడ్జెట్ సినిమాలోతో ఫేమస్ అయ్యాడు. ఇక కూలీలో పాత్ర దక్కడంతో ఇతర ఆఫర్లు కూడా వదులుకున్నాడు. దీని కోసం మరీ బల్క్ డేట్స్ కూడా ఇచ్చాడు. ఆ త్యాగానికి ప్రతిఫలం ఇప్పుడు సినిమాలో కనిపిస్తోంది. విలనిజంలో నాగార్జున కంటే సౌబిన్ పైనే ప్రేక్షకులు ఎక్కువ సాటిస్ఫై అయ్యారు.

 

పబ్లిక్ టాక్, కలెక్షన్లు పక్కన పెడితే ఈ సినిమాలో సౌబిన్ నటనకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా క్రూరత్వంతో ఉన్న పాత్రలో కనిపించడం మామూలు విషయం కాదు. అలాంటిది సౌబిన్ నటించడం కాదు ఏకంగా పాత్రలో జీవించేశాడు. ఒక సన్నివేశం లో అయితే నిజంగానే బురదలో నుండి బయటికి వచ్చి హావభావాలు ఇవ్వడం తన నటనలో పీక్స్ కు గుర్తింపు.

ఇక కన్నడ నటి రచిత రామ్ 2013లో రెబల్ స్టార్ ప్రభాస్ డార్లింగ్ సినిమా రీమేక్ బుల్ బుల్ తో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే పెద్ద స్టార్లతో నటించే అవకాశాలు దక్కించుకుంది. ఇక 2022లో సూపర్ మచ్చితో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కాకపోతే ఆ సినిమా ఫలితం నిరాశ పర్చింది. ఇప్పుడు కూలి సినిమా మాత్రం కెరీర్ లో బ్రేక్ ఇచ్చింది.

సింపుల్ గా కనిపించి సడెన్ గా షేడ్స్ మారిపోయే పాత్రలో రచిత రామ్ అదరగొట్టిందనే చెప్పాలి. అయితే ట్విస్ట్ లు ఇప్పుడు చెప్పి స్పాయిలర్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు. అయితే దర్శకుడు లోకేష్ ఆమె పాత్రను రాసుకున్న విధానం బాగుంది. ఆమె పాత్రలో డెప్త్ కూడా ఉంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఈమెతో పాటు సౌబిన్ పై సన్నివేశాలు కీలకంగా ఉన్నాయి. అతిథి పాత్రలో నటించిన అమీర్ ఖాన్ మర్చిపోతామేమో కానీ వీళ్ల ఇద్దరి పాత్రలు మాత్రం కచ్చితంగా ఆకట్టుకుంటాయి.

Tags:    

Similar News