కూలీ మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది.;

Update: 2025-08-15 07:11 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. థలైవర్ మార్క్ మాస్ ఎంటర్టైనర్‌గా, స్టార్ కాస్టింగ్‌తో ఈ సినిమా రిలీజ్‌కు ముందు నుంచే భారీ హైప్ సొంతం చేసుకుంది. నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సత్యరాజ్ వంటి అగ్రతారలు, పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ ఈ సినిమాపై మరింత క్రేజ్ పెంచాయి.

భారీ ప్రీ రిలీజ్ బిజినెస్

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ మల్టీప్లెక్సెస్ ఈ చిత్రానికి హక్కులను 43 కోట్లకు సొంతం చేసుకుంది. తమిళనాడు రైట్స్ దాదాపు 100 కోట్లు, కర్ణాటక, కేరళ 20 కోట్లు, నార్త్ ఇండియా 50 కోట్లు, ఓవర్సీస్ 85 కోట్లకు అమ్ముడైనట్లు టాక్. మొత్తం వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 310 కోట్లకు చేరింది.

ఓవర్సీస్‌లో థలైవర్ మాయ

కూలీ ఓవర్సీస్‌లో, ముఖ్యంగా నార్త్ అమెరికాలో, తమిళ సినిమాల చరిత్రలోనే అతి పెద్ద ప్రీమియర్ రికార్డు సృష్టించింది. అడ్వాన్స్ ప్రీమియర్ సేల్స్‌లోనే $3 మిలియన్ దాటింది. లేట్ నైట్ ప్రీమియర్స్ ఉన్నప్పటికీ, డే 1లోనే సుమారు $1 మిలియన్ వసూలు చేసిందని ట్రేడ్ అంచనా. సాధారణంగా USAలో తమిళ సినిమాలకు పెద్ద మార్కెట్ లేకపోయినా, రజనీ క్రేజ్ ఆ ట్రెండ్‌ను మార్చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్

తెలుగు వెర్షన్‌కు కూడా మంచి స్పందన లభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి డే 1లో సుమారు రూ.17 కోట్ల గ్రాస్ వచ్చిందని అంచనా. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ వంటి సిటీల్లో మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్స్ రెండింట్లోనూ మంచి ఆక్యుపెన్సీ కనిపించింది.

మిగతా రాష్ట్రాలు మరియు ప్రపంచ వసూళ్లు

తమిళనాడులో డే 1లో రూ.43 కోట్లకు పైగా వసూలు చేసినట్లు టాక్. హిందీ వెర్షన్ ఉత్తర భారతదేశంలో ₹5 కోట్ల వరకూ, కన్నడ రాష్ట్రంలో సుమారు రూ.0.5 కోట్ల వరకు రాబట్టిందని అంచనా. మిగతా కేరళ, రెస్టాఫ్ ఇండియాలో కూడా మంచి రిస్పాన్స్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో డే 1 గ్రాస్ సుమారు రూ.150 కోట్లకు పైగా ఉండొచ్చని విశ్లేషకుల అంచనా.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్ (అంచనా)

తమిళనాడు - రూ.43.87 కోట్లు

తెలుగు రాష్ట్రాలు - రూ.17.09 కోట్లు

హిందీ వెర్షన్ - రూ.5.04 కోట్లు

కన్నడ - రూ.0.55 కోట్లు

ఓవర్సీస్ (అన్ని భాషలు) - రూ.17 కోట్లు+

వరల్డ్ వైడ్ టోటల్ - రూ.150 కోట్లు+ (గ్రాస్, అంచనా)

Tags:    

Similar News