స్టార్ పవర్ మాత్రమే సరిపోదు!

ఒకప్పుడు స్టార్ హీరోల క్రేజ్ తోనే థియేటర్లు హౌస్ పుల్ అయిపోయేవి. భారీ కాంబినేషన్లు, క్రేజీ ప్రాజెక్టులు అంటే? చాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు ఖాయమని భావించేవారంతా.;

Update: 2026-05-05 23:30 GMT

ఒకప్పుడు స్టార్ హీరోల క్రేజ్ తోనే థియేటర్లు హౌస్ పుల్ అయిపోయేవి. భారీ కాంబినేషన్లు, క్రేజీ ప్రాజెక్టులు అంటే? చాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు ఖాయమని భావించేవారంతా. కానీ మారుతోన్న కాలంతో పాటు ప్రేక్షకుల అభిరుచి కూడా పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ప్రేక్షకులు కేవలం హీరోల ఇమేజ్ చూసో ? లేక భారీ హంగులను చూసో? సినిమాలను ఆదరించడం లేదు. కథలో బలం లేకపోతే ఎంతటి దిగ్గజ నటుల సినిమానైనా నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారని ఇటీవల విడుదలైన చిత్రాలు నిరూపించాయి. మలయాళ చిత్ర పరిశ్రమలో ఇద్దరు అగ్ర‌తార‌లు మోహన్ లాల్ - మమ్ముట్టి 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కలిసి నటించిన చిత్రం `పేట్రియాట్`.

ఇద్దరు దిగ్గజాలు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తున్నారంటే? అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఇటీవ‌ల విడుద‌లైన `పేట్రియాట్` బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. స్టార్ పవర్ ఎంత ఉన్నా? బలహీనమైన కథనం , ఆసక్తి లేని సన్నివేశాల వల్ల కార‌ణ‌గా ప్రేక్షకులు చిత్రాన్ని ఆదరించలేదు. కేవలం కాంబినేషన్ క్రేజ్ సినిమాను గట్టెక్కించలేదని సినిమా ఫలితం మ‌రోసారి రుజువు చేసింది. అలాగే దక్షిణాదిలో అద్భుతమైన నటిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీపై భారీ అంచనాలే ఉండేవి. ఆమె నటించిన హిందీ చిత్రం `ఏక్ దిన్` ఎంతో హైప్ మ‌ధ్య రిలీజ్ అయింది.

న‌టిగా సాయి ప‌ల్ల‌వి పాస్ అయింది. కానీ కథలో దమ్ము లేకపోవడంతో ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఒక నటిగా తన ప్రతిభను చాటుకున్నా? సినిమా విజయవంతం కావడానికి నటన మాత్రమే సరిపోదని పటిష్టమైన కథాంశం ఉండాలని ఈ చిత్రం మరోసారి రుజువు చేసింది. అలాగే విలక్షణ నటుడు ధనుష్ నటించిన `కరా` చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. జాతీయ అవార్డు గ్రహీత, విభిన్నమైన పాత్రలను ఎంచుకునే ధ‌నుష్‌ సినిమా కూడా నిరాశ పరచడం సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

ఈ సినిమాలన్నీ నేర్పుతున్న పాఠం ఒక్క‌టే. భారీ బడ్జెట్, విదేశీ లొకేషన్లు, స్టార్ కాస్టింగ్ వంటివి అలంకారాలు మాత్రమే. సినిమాకు అసలైన ప్రాణం కథ. అది లేనప్పుడు మిగిలిన ఎన్ని హంగులు ఉన్నా ? అది వృధా ప్రయాసగానే మిగిలిపోతుంద‌న్న‌ది కాద‌న‌లేని నిజం. ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కంటెంట్‌ను వీక్షిస్తున్నారు. దీంతో వారిలో సినిమాపై అవగాహన పెరిగింది. రొటీన్ ఫార్ములా కథలు, లాజిక్ లేని యాక్షన్ సన్నివేశాలను అంగీకరించడం లేదు. చిన్న సినిమా అయినా? అందులో కొత్తదనం ఉంటే బ్రహ్మరథం పడుతున్నారు. అదే సమయంలో వందల కోట్ల బడ్జెట్ ఉన్న పెద్ద సినిమాల్లో విషయం లేకపోతే మొదటి రోజే తిప్పి కొడుతున్నారు. ఈ ట్రెండ్ స్టార్ హీరోలకు - దర్శకులకు ఓ హెచ్చరిక లాంటిది. స్టార్ పవర్ అనేది ప్రేక్షకులను థియేటర్ వరకు తీసుకురావడానికి మాత్రమే. ఆపై కంటెంట్ మాత్ర‌మే స‌త్తా చాటాల్సి ఉంటుంది.

Tags:    

Similar News