వీఎఫ్ఎక్స్ లేకుండా అద్భుతాలు సృష్టించిన సినిమాలు ఇవే!

అప్పట్లో టెక్నాలజీ లేకుండానే మాయాజాలం సృష్టించిన ఆ అద్భుత చిత్రాల విశేషాలు ఇప్పడు చూద్దాం..

Update: 2026-06-18 12:30 GMT

ఇప్పుడు కంప్యూటర్ గ్రాఫిక్స్ , గ్రీన్ స్క్రీన్ల సాయంతో ఎంతటి విజువల్ వండర్ అయినా ఈజీగా క్రియేట్ చేస్తున్నారు. కానీ, ఎలాంటి టెక్నాలజీ లేని ఆ రోజుల్లోనే కేవలం కెమెరా ట్రిక్స్, ప్రాక్టికల్ ఎఫెక్ట్స్, మినియేచర్ సెట్లు మరియు అద్భుతమైన కథా బలంతో ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన క్లాసిక్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. అప్పటి దర్శకుల విజన్, మేకింగ్ స్టైల్ చూస్తే ఇప్పటికీ మన మేధస్సుకు అందదు. అప్పట్లో టెక్నాలజీ లేకుండానే మాయాజాలం సృష్టించిన ఆ అద్భుత చిత్రాల విశేషాలు ఇప్పడు చూద్దాం..

హాలీవుడ్‌ను షేక్ చేసిన రియలిజం, యానిమేట్రానిక్స్:

హాలీవుడ్ చరిత్రలో మైలురాయిగా నిలిచిన 'ది గాడ్‌ఫాదర్' (1972) సినిమాలో ఎలాంటి గ్రాఫిక్స్ వాడలేదు. కేవలం బలమైన స్క్రీన్ ప్లే, నటన, రియల్ లొకేషన్లతోనే ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. ఇక 'జూరాసిక్ పార్క్' (1993) చిత్రంలో డైనోసార్లను చూపించడానికి డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ చాలావరకు లైఫ్-సైజ్ రోబోటిక్స పప్పెట్రీనే వాడారు. ఇక మన టాలీవుడ్‌లో వచ్చిన కల్ట్ క్లాసిక్ 'మాయాబజార్' (1957) కూడా ఆనాటి సాంకేతిక ప్రతిభకు ఒక నిలువెత్తు నిదర్శనం.

‘పాతాళభైరవి’లో మినియేచర్ల మాయాజాలం:

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే మొదటి భారీ సోషియో-ఫాంటసీ సూపర్ హిట్ సినిమా 'పాతాళభైరవి' (1951). ఆ రోజుల్లో పెద్ద పెద్ద కోటలు, పాతాళంలో ఉండే లోయలు, మంత్రగాడి గుహలను చూపించడానికి చేత్తో చేసిన చిన్న చిన్న మినియేచర్ మోడల్స్ తయారు చేశారు. వాటిని కెమెరా ముందు ఉంచి, లైటింగ్ మాయాజాలంతో అవి నిజమైన పెద్ద కట్టడాల్లా కనిపించేలా చేసి ప్రేక్షకులను అబ్బురపరిచారు.

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’లో కెమికల్ స్మోక్:

మెగాస్టార్ చిరంజీవి, అతిలోకసుందరి శ్రీదేవి నటించిన ఇండస్ట్రీ హిట్ 'జగదేకవీరుడు అతిలోకసుందరి' (1990) లో అసలు డిజిటల్ VFX లేదు. ఇక దేవలోకం సెట్లను స్టూడియోలోనే భారీగా వేశారు. ఇక మేఘాల ఎఫెక్ట్ కోసం కెమికల్ స్మోక్, ఐస్ ముక్కలను ఉపయోగించి గాల్లో తేలుతున్న అనుభూతిని తెచ్చారు.

‘ఆదిత్య 369’ టైమ్ మెషిన్ మ్యాన్యువల్ మ్యాజిక్:

తెలుగులో వచ్చిన మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ సినిమా 'ఆదిత్య 369' (1991). ఇందులో టైమ్ మెషిన్ లోపల జరిగే వింతలు, విచిత్రమైన లైటింగ్ ఎఫెక్ట్స్ అన్నీ మాన్యువల్ ఎలక్ట్రికల్ బోర్డుల ద్వారా సింపుల్‌గా చేశారు. అలాగే డైనోసార్ సీన్ల కోసం ప్రత్యేకంగా ప్రాక్టికల్ మోడల్స్ ఉపయోగించి ఆ రోజుల్లోనే థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచారు.

ఇప్పుడు కంప్యూటర్ ముందు కూర్చుని గ్రాఫిక్స్ చేయడం చాలా తేలికైపోయింది కానీ, ఆ రోజుల్లో ప్రతి సీన్ వెనుక ఎంతో శ్రమ, మరెంతో ఊహాశక్తిఉండేవి. ఎలాంటి అత్యాధునిక టెక్నాలజీ లేకపోయినా, కేవలం తమ మేధస్సుతో వెండితెరపై అద్భుతాలు సృష్టించిన అప్పటి దర్శకుల విజన్ మరియు ప్యాషన్‌కు నిజంగా హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే!

Tags:    

Similar News