విడుదలకు ఏడాది ఉండగానే అంచనాలు పీక్స్...!
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి అవెంజర్స్ సిరీస్‌లో ఐదవ పార్ట్‌గా రాబోతున్న అవెంజర్స్: డూమ్స్‌డే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.;
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి అవెంజర్స్ సిరీస్‌లో ఐదవ పార్ట్‌గా రాబోతున్న అవెంజర్స్: డూమ్స్‌డే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. గత ఏడాది కాలంగా ఈ సినిమా కోసం హాలీవుడ్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరో ఏడాది పాటు ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సినిమా నుంచి ఒక్కొక్క పాత్రను పరిచయం చేస్తూ అంచనాలు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా కొత్త ఏడాది కానుక అన్నట్లుగా ఈ సినిమాలో నటిస్తున్న క్రిస్ హోమ్స్ వర్త్ పాత్రను రివీల్ చేయడం జరిగింది. థోర్ గా క్రిస్ తిరిగి వస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఆయన విజువల్స్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కించేవిగా ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి, ఆ పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరుగుతూ, సినిమా పై అంచనాలు భారీగా పెంచుతున్నారు.
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి...
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌లు, పోస్టర్‌లు వచ్చాయి. కానీ తాజాగా థోర్ ను పరిచయం చేసిన నేపథ్యంలో అంచనాలు పెంచేశారు. సినిమా విడుదలకు ఇంకా దాదాపు ఏడాది సమయం ఉన్నప్పటికీ ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. బాబోయ్ ఇదేం రచ్చ అన్నట్లుగా సోషల్ మీడియాలో అవెంజర్స్ అభిమానులు తెగ సందడి చేస్తున్నారు. థోర్ ను మోకాళ్లపై కూర్చుని ప్రార్థన చేస్తున్నట్లుగా చూపించిన విజువల్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. యుద్దంలో అలసి పోయిన వ్యక్తి ఎలా అయితే ఉంటాడో అలా థోర్ లుక్ ఉంది అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. కన్నీటి మరకలు, మొహం పై యుద్దం తాలూకు గాయాలు ఇలా చాలా గుర్తులు సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి సినిమా పై అంచనాలు పెంచే విధంగా ఈ తాజా టీజర్ ఉంది అనడంలో సందేహం లేదు.
అవెంజర్స్ : డూమ్స్ డే సినిమా విడుదల
అవెంజర్స్: డూమ్స్‌డే సినిమాను 2026 డిసెంబర్ 18న క్రిస్మస్ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. సినిమా షూటింగ్ మొత్తం 2025 లో పూర్తి చేశారని తెలుస్తోంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం అయింది. వేలాది మంది వీఎఫ్‌ఎక్స్ టెక్నీషియన్స్ ఈ సినిమా కి సంబంధించిన వర్క్ లో బిజీగా ఉన్నారు. అనుకున్న సమయంకు సినిమాను తీసుకు వచ్చేందుకు గాను నిర్మాణ సంస్థ పని చేస్తుందని, వందల కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించబోతున్న సినిమాగా నిలుస్తుందని అవేంజర్స్ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో యానిమేషన్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. ఆ సినిమాలను వెనక్కి నెట్టి మరీ 2026 లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన సినిమాగా నిలవడం మాత్రమే కాకుండా అకాడమీ అవార్డుల జాబితాలోనూ ఈ సినిమా కు సంబంధించిన వారి పేర్లు కనిపించబోతున్నాయనే విశ్వాసం ఎంతో మంది వ్యక్తం చేస్తున్నారు.
సీక్రెట్ వార్స్ సినిమాతో..
ఈ ఏడాది పొడవునా రెండు మూడు నెలలకు ఒకటి చొప్పున టీజర్, వీడియోను విడుదల చేయడం ద్వారా అంచనాలు మరింతగా పెంచే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే కచ్చితంగా డూమ్స్ డే సినిమా ఓపెనింగ్స్ వరల్డ్ రికార్డ్ ను నమోదు చేసినా ఆశ్చర్యం లేదు అనేది కొందరి అభిప్రాయం. గతంలో ఇన్ఫినిటీ వార్, ఎండ్‌గేమ్‌లకు దర్శకత్వం వహించిన ఆంథోనీ - జో రస్సో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) లో 39వ చిత్రంగా ఈ సినిమా రాబోతుంది. అవెంజర్స్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కనుక ఈ సినిమాను రౌండ్ ది గ్లోబ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. డూమ్స్ డే కి సీక్వెల్ గా రాబోతున్న సీక్రెట్ వార్స్ సినిమాను సరిగ్గా ఏడాది తర్వాత అంటే 2027 డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. ఇదే చివరి సిరీస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని హాలీవుడ్ పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తానికి అవేంజర్స్ సినిమాకు ఉన్న క్రేజ్, తాజాగా విడుదలైన టీజర్ కారణంగా అవెంజర్స్ : డూమ్స్‌డే సినిమా విడుదల ఏడాది ఉండగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరిగాయి. మరి అంచనాలు ఏ స్థాయి మేరకు ఈ సినిమా అందుకుంటుంది అనేది చూడాలి.