• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తేజ్ ఆ సీక్వెల్ కథ...

తేజ్ ఆ సీక్వెల్ కథ ఏమైంది..?

| లాస్ట్ఇయర్ బ్రో తర్వాత సాయి తేజ్ కొద్దిపాటి గ్యాప్ తీసుకుని ఈమధ్యనే సంబరాల ఏటిగట్టు అంటూ ఒక సినిమా మొదలు పెట్టాడు.

By - Tupaki Desk
Update: 2024-12-30 11:30 GMT

మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ యాక్సిడెంట్ తర్వాత సినిమాల పరంగా కాస్త లేట్ అవుతూ వస్తున్నా ఒక దానికి మించి మరొకటి అనిపించేలా చేస్తున్నాడు. లాస్ట్ఇయర్ బ్రో తర్వాత సాయి తేజ్ కొద్దిపాటి గ్యాప్ తీసుకుని ఈమధ్యనే సంబరాల ఏటిగట్టు అంటూ ఒక సినిమా మొదలు పెట్టాడు. ఆ సినిమాతో మొదటిసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు తేజ్. ఐతే తేజ్ ఈ సినిమాతో పాటు ఒక సినిమా సీక్వెల్ చేస్తున్నాడని ఆమధ్య వార్తలు వచ్చాయి. సాయి తేజ్ తో చిత్రలహరి సినిమా తీసిన డైరెక్టర్ కిశోర్ తిరుమల ఆ సినిమాకు సీక్వెల్ గా చిత్రలహరి 2 చేసే ప్లాన్ లో ఉన్నాడని వార్తలు వచ్చాయి.

చిత్రలహరి ఒక ఫెయిల్యూర్ కథ.. లైఫ్ లోనే కాదు లవ్ లో కూడా ఫెయిల్ అవుతాడు. ఐతే ఫైనల్ గా సినిమా ఎండింగ్ లో సక్సెస్ మార్గాన్ని కనిపెడతాడు. ఆ సినిమా యూత్ ఆడియన్స్ కి బాగా ఎక్కేసింది. అంతేకాదు ఆ సినిమాలో సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. 2019 లో వచ్చిన చిత్రలహరి సినిమా తెలుగు ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. ఆ తర్వాత కిశోర్ తిరుమల రెడ్, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా చేసినా అవేవి వర్క్ అవుట్ కాలేదు. అందుకే తేజ్ తో చిత్రలహరి 2 చేయాలని కిశోర్ ఫిక్స్ అయ్యాడు.

కానీ కిశోర్ కథ సిద్ధం చేసినా తేజ్ ఇప్పుడప్పుడే ఆ సినిమా చేసే ఆలోచనలో లేడనట్టు తెలుస్తుంది. చిత్రలహరి 2 సినిమా కోసం తేజ్ అలాంటి లుక్ ని సిద్ధం చేయాలి. ప్రస్తుతం తేజ్ మాత్రం సంబరాల ఏటిగట్టు మీద ఫోకస్ చేస్తున్నాడు. దాదాపు ఏడాది పాటు ఇదే సినిమా చేసేలా ఉన్నాడు. అందుకే చిత్రలహరి 2 ఉంటుందా లేదా అన్న డౌట్ ఇంకా అలానే ఉంది. మరోపక్క కిశోర్ కు కూడా పెద్దగా ఛాన్స్ లు లేవు. ఆయన తీసిన రెడ్, ఆడవాళ్లు మీకు జోహార్లు రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అందుకే ఆ సినిమాల తర్వాత అతనికి ఛాన్సులు రావట్లేదు.

తేజ్ తో చిత్రలహరి 2 సినిమా చేస్తే మాత్రం మళ్లీ కిశోర్ తిరిగి ఫాం లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఐతే హిట్ సినిమా సీక్వెల్ అంటే అది అంత ఈజీ పనేమి కాదు. ఐతే కిశోర్ తిరుమల సినిమాల్లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. అందుకే చిత్రలహరి 2 కచ్చితంగా అతన్ని మళ్లీ డైరెక్టర్ గా తన టాలెంట్ ప్రూవ్ చేసుకునేలా చేస్తుందని ఆడియన్స్ భావిస్తున్నారు.

Tags:    
  • Saidharamtej 
  • Saidurgatej 
  • Kishoretirumala 
  • Chitralahari 
  • Chitralahari2 
  • Sambarayetigattu 
  • Chitralaharisequel 
  • Megafans 
  • Tollywood 
  • BRO 
  • Virupaksha 
  • Red 
  • Filmindustry 

Similar News

సంక్రాంతి 'కాకా' పై రూ.150 కోట్ల పందెం..!

2026-11-18 22:30 GMT

టైగ‌ర్ అంటే కాంతకు ఇష్ట‌మేనా?

2026-11-18 19:30 GMT

సలార్‌ 2 రాకుండానే 'డ్రాగన్‌ 2' వస్తుందా?

2026-11-18 18:30 GMT

మారుతోన్న హీరోయిన్ల ప్రాధాన్య‌త‌!

2026-11-18 17:30 GMT

టాలీవుడ్‌లో రేణుదేశాయ్ ఆ తరహా పాత్రలకు ఓకే చెప్పేనా?

2026-11-18 16:30 GMT

డబ్బింగ్ సినిమాలకు పోటీ పడుతున్న టాలీవుడ్‌ బడా నిర్మాతలు!

2026-11-18 15:30 GMT

బాలీవుడ్ హీరోయిన్ల పోస్ట్-ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్ & ట్రెండ్స్!

2026-11-18 14:30 GMT

అసలు అనుష్క నెక్స్ట్ ప్లాన్ ఏంటి!

2026-11-18 13:30 GMT

వృషకర్మ కోసం భారీ సెట్స్.. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఇంటర్వ్యూ

2026-11-18 12:45 GMT

అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు.. ఆపై సైలెంట్‌గా విడాకులు!

2026-11-18 12:30 GMT

అన్ని రకాల జంతువులను రుచి చూశా.. ఆయన వల్లే సాధ్యం అంటున్న శృతిహాసన్!

2026-11-18 11:30 GMT

చిరు, నాగ్‌ను చూసి యంగ్‌ హీరోలు నేర్చుకోవాలి!

2026-11-18 11:19 GMT

Copyright @2026

Powered by Blink CMS