• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగా 'బ్లడ్ ప్రామిస్'

మెగా 'బ్లడ్ ప్రామిస్'

| ఈ బ్లడ్ ప్రామిస్ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ సినిమా ప్రకటనకు ఫిదా అయ్యారు.

By - Tupaki Desk
Update: 2024-12-04 05:26 GMT

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ అందరి దృష్టిని ఆకర్షించింది. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కు నేచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంత సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. తాజాగా విడుదలైన స్టిల్ తో ఈ ప్రాజెక్ట్ పై హైప్ మరింత పెరిగింది.

 

ఈ కాన్సెప్ట్ పోస్టర్ లో చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కలిసి చేతులను బిగించి రక్తంతో ఉన్న స్టిల్ కనిపిస్తోంది. ఇది కేవలం ఒక స్టిల్ కాదు, దాని వెనుక సినిమా కథలో ఎంత పవర్ ఫుల్ ఎలిమెంట్ ఉందో చూపించేలా ఉంది. ఈ స్టిల్ ను నాని "ఇట్స్ ఎ బ్లడ్ ప్రామిస్" అంటూ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం ఆడియన్స్ లో భారీ ఎత్తున ఉత్సాహం నింపింది.

మెగాస్టార్ చిరంజీవి ఒక వైపు తన కెరీర్ లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇప్పుడీ ప్రాజెక్ట్ లో కూడా చిరు కొత్తగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. పోస్టర్ లో కనిపిస్తున్న రక్తపూత చేతులలోనే కథ ప్రధాన అంశం దాగి ఉందని భావిస్తున్నారు. సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. నాని చేసిన "బ్లడ్ ప్రామిస్" కామెంట్ ఈ ప్రాజెక్ట్ మీద మరింత సస్పెన్స్ కలిగించింది.

'దసరా' సినిమాతో డైరెక్టర్ గా తన టాలెంట్ చూపించిన శ్రీకాంత్ ఓదెల, ఇప్పుడు చిరంజీవితో తన రెండో చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ సినిమా కథను విన్న చిరంజీవి సింగిల్ సిట్టింగ్ లో ఓకే చెప్పడం ఈ ప్రాజెక్ట్ పై చిరు పెట్టిన నమ్మకానికి నిదర్శనం. శ్రీకాంత్ డైరెక్షన్ లో చిరు ఎలా కనిపిస్తారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

ఇంతకుముందు "చిరు నా హీరో, ఆయనతో సినిమా చేయడం నా కల" అంటూ నాని అనేక సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన సమర్పకుడిగా వ్యవహరించడంతో కేవలం చిరు అభిమానిగా మాత్రమే కాకుండా, తన ఫ్యాన్ బాయ్ తాండవాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. నాని SLV సినిమాస్ ఈ ప్రాజెక్ట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి కొత్త లుక్ తో, శ్రీకాంత్ ఓదెల క్రియేటివ్ టచ్ తో ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని టాక్. ఈ బ్లడ్ ప్రామిస్ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ సినిమా ప్రకటనకు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా విడుదల కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాని సమర్పకుడిగా, సుధాకర్ చెరుకూరి నిర్మాణ బాధ్యతలను చేపట్టారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మరొక ట్రెండ్ సెట్టర్ గా నిలిచే అవకాశం ఉంది.

Tags:    
  • Megastarchiranjeevi 
  • Srikanthodela 
  • ChiruOdelaCinema 
  • Violentmovie 
  • Dasaramovie 
  • Nani 
  • SLVCinemas 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS