• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆయ‌న కీర్తి...

ఆయ‌న కీర్తి అజ‌రామ‌రం..త‌ర‌త‌రాలు శాశ్వ‌తం!

| కుటుంబ స‌భ్యులంతా హైద‌రాబాద్ లోని ఆయ‌న ఘాట్ వ‌ద్ద‌కు చేరుకుని నివాళ్లు అర్పిస్తున్నారు

By - Tupaki Desk
Update: 2024-05-28 06:44 GMT

నట‌సార్వ‌భౌమ, టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకులు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. కుటుంబ స‌భ్యులంతా హైద‌రాబాద్ లోని ఆయ‌న ఘాట్ వ‌ద్ద‌కు చేరుకుని నివాళ్లు అర్పిస్తున్నారు. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఎన్టీఆస్ సేవ‌ల్ని గుర్తు చేసుకుంటున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానులు పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు.

`కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శమన్నారునందమూరి తారకరామారావు గారిని ఈ రోజు గుర్తు చేసుకుంటూ, వారు ప్రజాజీవితంలో చేసిన సేవలకు భారత రత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నానని` అని రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌కు ఎన్టీఆర్ తో తాను దిగిన ఫొటోను చిరంజీవి జత చేశారు.

ఈ ఫొటో చిరంజీవి భుజంపై ఎన్టీఆర్ చేయి వేసి హుందాగా నడుస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఎన్టీఆర్‌కు భారతరత్న రావడం అనేది నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రజల చిరకాల ఆకాంక్ష. ఇదే విషయాన్ని చిరంజీవి ఇటీవ‌ల‌ ఢిల్లీలోనూ ప్ర‌స్తావించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల జ‌రిగిన ప‌ద్మ అవార్డుల ప్ర‌దానోత్స‌వం సంద‌ర్భఃగా చిరంజీవి ఢిల్లీ వెళ్లారు.

ప‌ద్మ విభూష‌ణ్ అందుకున్న అనంత‌రం ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో మీడియా నుంచి సీనియర్‌ ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రస్తావన రాగా.. ఆయన దీనికి స్పందిస్తూ.. `అవును.. ఎన్టీఆర్ గారికి భారతరత్న రావడం ఎంతైనా సముచితం. నేను కూడా మనస్ఫూర్తిగాద దీనిని అభిలాషిస్తున్నాను. ఆయనకు భారతరత్న రావాలని కోరుకుంటున్నాను` అని బ‌ధులిచ్చారు. నేడు జ‌యంతి సంద‌ర్భంగా అదే విష‌యాన్ని మ‌రోసారి గుర్తు చేసారు. ప్ర‌స్తుతం చిరంజీవి హీరోగా `విశ్వంభ‌ర` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను.… pic.twitter.com/YFtWPKKW8n

— Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2024
Tags:    
  • Chiranjeevi 
  • Seniorntr 
  • Ntramarao 
  • Megastar 
  • Ntrbirthanniversery 
  • Seniorntrjayanthi 
  • Tollywood 
  • Filmindustry 
  • Bharataratna 

Similar News

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

Copyright @2026

Powered by Blink CMS