విశ్వంభర అక్కడ ఆగిందా?
అయితే విశ్వంభర రిలీజ్ లేటవడానికి కారణం ఏంటా అనుకుంటున్న టైమ్ లో ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో ఓ వార్త వినిపిస్తోంది.;

భోళా శంకర్ తర్వాత చిరంజీవి చాలా గ్యాప్ తీసుకుని యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో చేసిన సినిమా విశ్వంభర. యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని చిరంజీవి తన నెక్ట్స్ మూవీని కూడా మొదలుపెట్టాడు. కానీ ఇంకా విశ్వంభర రిలీజ్ ఎప్పుడనేది మాత్రం క్లారిటీ లేదు. దీంతో ఈ విషయంలో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి విశ్వంభర సినిమా ఈ ఏడాది సంక్రాంతికే రావాల్సింది కానీ ఆ టైమ్ లో గేమ్ ఛేంజర్ వస్తుండటంతో చిరూ తన సినిమాను వాయిదా వేసుకున్నాడు. దానికి తోడు వీఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా పెండింగ్ ఉండటంతో విశ్వంభర సినిమా పోస్ట్‌పోన్ అయింది. మొన్నామధ్య రిలీజైన విశ్వంభర టీజర్ లోని వీఎఫ్ఎక్స్ కు భారీ ట్రోలింగ్ జరగడంతో ఇప్పుడు ఆ బాధ్యతల్ని వేరే టీమ్ కు అప్పగించి చాలా జాగ్రత్తగా చేయిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే విశ్వంభర రిలీజ్ లేటవడానికి కారణం ఏంటా అనుకుంటున్న టైమ్ లో ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో ఓ వార్త వినిపిస్తోంది. విశ్వంభర సినిమా ఐటెమ్ సాంగ్ దగ్గర ఆగిపోయిందని, ఆ సాంగ్ ను ఏ హీరోయిన్ తో చేయాలా అని చిత్ర యూనిట్ సందిగ్ధంలో ఉందని సమాచారం. యంగ్ హీరోయిన్లను తీసుకుంటే లేని పోని ట్రోలింగ్ తలనొప్పి. ఇక మిగిలింది తమన్నా, పూజా హెగ్డే.
తమన్నా ఇప్పటికే చాలా ఐటెం సాంగ్స్ చేసి ఉండటంతో తమన్నా అయితే రొటీన్ అయిపోతుందని పూజా హెగ్డేను తీసుకోవాలా అనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందట. మొత్తానికి ఐటెం సాంగ్ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేక విశ్వంభర టీమ్ గత కొన్నాళ్లుగా డిస్కషన్స్ చేస్తుందట. అయితే సీజీ వర్క్స్ అన్నీ పూర్తయ్యి, చేతికి వస్తే కానీ విశ్వంభర రిలీజ్ డేట్ గురించి ఓ క్లారిటీ రాలేదు.
జూన్ ఫస్ట్ వీక్ లోనే సీజీ వర్క్ పూర్తి అవాల్సింది కానీ ఇంకా అది పూర్తవలేదు. సీజీ పూర్తైపోయి కాపీ వస్తే ఆగస్ట్ నెలాఖరులో లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇక సినిమా హక్కుల విషయానికొస్తే ఆల్రెడీ విశ్వంభర డిజిటల్ రైట్స్ ను అమెజాన్‌కు, శాటిలైట్ రైట్స్ ను జీకి అమ్మేసినట్టు తెలుస్తోంది. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.