• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'విశ్వంభ‌ర‌' ఆ హైప్‌ని...

'విశ్వంభ‌ర‌' ఆ హైప్‌ని క్రియేట్ చేయడం క‌ష్ట‌మేనా?

| `వాల్తేరు వీర‌య్య‌` హిట్ త‌రువాత చిరు `భోళా శంక‌ర్‌`తో భారీ డిజాస్ట‌ర్‌ని ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-04-18 09:30 GMT

`వాల్తేరు వీర‌య్య‌` హిట్ త‌రువాత చిరు `భోళా శంక‌ర్‌`తో భారీ డిజాస్ట‌ర్‌ని ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. త‌మిళ హిట్ ఫిల్మ్ `వీరం` ఆధారంగా మెహ‌ర్ ర‌మేష్ రీమేక్ చేసిన ఈ మూవీ చిరుకు దారుణ‌మైన ఫ్లాప్‌ని అందించి షాక్ ఇచ్చింది. అంత‌కు ముందు `ఆచార్య‌` షాక్ ఎదుర్కొన్న మెగాస్టార్ ఈసారి బిగ్ హిట్‌ని సొంతం చేసుకుని మ‌ళ్లీ ట్రాక్‌లోకి రావాల‌నే ల‌క్ష్యంతో చేస్తున్న మూవీ `విశ్వంభ‌ర‌`. ఇదొక ఫాంట‌సీ యాక్ష‌న్ డ్రామా.

`బింబిసార‌` ఫేమ్ మ‌ల్లిడి వ‌శిష్ట ఈ భారీ క్రేజీ గ్రాఫిక‌ల్ యాక్ష‌న్ డ్రామాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. త్రిష‌, అషికా రంగ‌నాథ్ న‌టిస్తున్నారు. గ్రాఫిక్స్ ప్ర‌ధానంగా సాగే ఈ మూవీని `జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి`కి సీక్వెల్‌గా చేస్తున్నారంటూ గ‌త కొంత కాలంగా వార్త‌లు షికారు చేస్తున్నాయి. అయితే టీమ్ మాత్రం ఈ వార్త‌ల‌పై ఎలాంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు.

ఇక ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్‌పై ఇందులో ఉప‌యోగించి గ్రాఫిక్స్‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన విష‌యం తెలిసిందే.`విశ్వంభ‌ర‌` ప్రాజెక్ట్ ప్ర‌క‌టించిన స‌మ‌యంలో దీన్ని `జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి`కి సీక్వెల్‌గా చేస్తున్నార‌న‌గానే ఈ మూవీపై అంద‌రిలోనూ భారీ హైప్ ఏర్ప‌డింది. కానీ ఆ హైప్ అంతా ఫ‌స్ట్ గ్లింప్స్ రిలీజ్ కాగానే ఆవిరైపోయింది. గ్రాఫిక్స్ ఆశించిన స్థాయిలో లేవ‌ని, చిరు సినిమాకు ఇలాంటి గ్రాఫిక్సా? అని అంతా కామెంట్ చేశారు.

దీంతో మ‌ళ్లీ వీఎఫ్ ఎక్స్‌ని మార్చేసే ప‌నిలో ప‌డిన టీమ్ మ‌రో సారి ఆ త‌ప్పులు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు ప‌డ‌టం మొద‌లు పెట్టింది.ఈ ఎఫెక్ట్ ఈ మూవీ ఓటీటీ రైట్స్‌పై కూడా ప‌డ‌టంతో చిత్ర బృందంలో టెన్ష‌న్ మొద‌లైంద‌ట‌. తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ మూవీపై హైప్ క్రియేట్ కావాలంటే `విశ్వంభ‌ర‌` ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ మ‌రింత ఎఫెక్టీవ్‌గా ఉండాల‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.

అలా లేక‌పోతే సినిమాపై హైప్ క్రియేట్ కావ‌డం క‌ష్ట‌మ‌ని, అది సినిమాపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపించే అవ‌కాశం ఉంద‌ని అభిమానులు కూడా టెన్ష‌న్ ప‌డుతున్నారు. మ‌రి టీమ్ ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటారా? లేక మ‌ళ్లీ అదే త‌ప్పు చేస ఫ్యాన్స్‌ని నిరుత్సాహ‌ప‌రుస్తారా? అన్న‌ది వేచి చూడాల్సిందే.

Tags:    
  • Vishwambharateaser 
  • Chiranjeevi 
  • VFXcriticism 
  • Fantasyactionfilm 
  • MallidiVassishta 
  • AIvisuals 
  • Telugucinema 
  • OTTrights 
  • Releasedelay 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS