త‌మ్ముళ్లు మ‌హేష్‌- ప‌వ‌న్‌తో చేసాను: విక్ట‌రీ వెంక‌టేష్‌

మెగాస్టార్ చిరంజీవి- విక్ట‌రీ వెంక‌టేష్ కాంబినేష‌న్ లో అనిల్ రావిపూడి రూపొందించిన `మన శంకరవరప్రసాద్ గారు` సంక్రాంతి బ‌రిలో విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2026-01-08 04:24 GMT

మెగాస్టార్ చిరంజీవి- విక్ట‌రీ వెంక‌టేష్ కాంబినేష‌న్ లో అనిల్ రావిపూడి రూపొందించిన `మన శంకరవరప్రసాద్ గారు` సంక్రాంతి బ‌రిలో విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని సాహు గారపాటి - సుష్మిత కొణిదెల నిర్మించారు. నయనతార, కేథ‌రిన్ క‌థానాయిక‌లు. వెంకీ ఈ చిత్రంలో 45 నిమిషాల నిడివి ఉన్న పాత్ర‌లో న‌టించారు.

గురువారం సాయంత్రం హైద‌రాబాద్‌లో జ‌రిగిన ప్రీరిలీజ్ వేడుక‌లో విక్ట‌రీ వెంక‌టేష్ మాట్లాడుతూ-``నేనెప్పుడూ డిఫ‌రెంట్ సినిమాలు చేసాను. మా త‌మ్ముళ్లు మ‌హేష్‌తో చేసాను.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో చేసాను..అప్పుడు మీరు ఎలా సౌండ్ చేసారో గుర్తింది. ఇప్పుడు అన్న‌య్యతో చేసాను.. . సౌండ్ ఇంకా ఉండాలి. ఇదే సంక్రాంతి స్పిరిట్ అంటే'' అంటూ ఫ్యాన్స్ లో జోష్ నింపారు. మెగా విక్ట‌రీ ఫ్యాన్స్ అంద‌రికీ ఇదే నా థాంక్స్.. అంటూ వెంకీ మామ త‌న‌దైన శైలిలో జోష్ ని నింపారు. ''చిరు స‌ర్ తో న‌టించ‌డం వండ‌ర్ ఫుల్ అనుభ‌వం.. మామూలుగా లేదు. ర‌ఫ్ఫాడేస్తారుగా.. నేను కూడా కొన్ని చోట్ల‌ ర‌ఫ్ఫాడేశాను. మేం ఇద్ద‌రూ క‌లిస్తే ర‌చ్చే. థాంక్యూ స‌ర్ ఇది గొప్ప అనుభ‌వం... అంటూ మెగాస్టార్ తో వ‌ర్కింగ్ ఎక్స్ పీరియెన్స్ గురించి వెంకీ మాట్లాడారు.

అనీల్ రావిపూడితో పెద్ద విజ‌యాలు సాధించాన‌ని కూడా వెంకీ ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు. వెంకీ మాట్లాడుతూ-``ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడికి థాంక్స్ .. అనీల్ కాంబినేష‌న్ లో మా సినిమాల‌న్నిటినీ మీరు పెద్ద హిట్టు చేసారు. మ‌న‌శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు ర‌చ‌యిత‌ల టీమ్ తో పాటు స‌మీర్, భీమ్స్, త‌మ్మిరాజు, ప్ర‌కాష్ , సాయి.. సాంకేతిక నిపుణులంతా బాగా వ‌ర్క్ చేసారు'' అని అన్నారు. నిర్మాత‌లు సాహూ గార‌పాటి -సుస్మిత రాజీ లేకుండా పెట్టుబ‌డులు పెట్టార‌ని తెలిపారు. న‌య‌నతార‌తో తుల‌సి, లక్ష్మి లాంటి సినిమాలు చేసాను. ఈ సినిమాలో అద్భుతంగా న‌టించిందని కూడా వెంకీ కితాబిచ్చారు.

వెంకీతో టైమ్ తెలియ‌దు..

విక్ట‌రీ వెంక‌టేష్ తో క‌లిసి ప‌ని చేసిన అనుభ‌వం గురించి మెగాస్టార్ ఈ వేదిక‌పై మాట్లాడుతూ .. తాను వెంకీని ఒక చిన్న సైజు గురువులా ఫీల‌వుతాన‌ని అన్నారు. చిరు మాట్లాడుతూ.. ''వెంకీ త‌న ఏజ్ కి మించిన విష‌యాలు చెబుతాడు.. మ‌న‌సు ఎంత ప్ర‌శాంతంగా ఉండాలి? ఎలా జీవించాలి? అనేవి చెబుతుంటే చిన్న సైజు గురువులా అనిపిస్తాడు. ఎంతో స్ఫూర్తి నింపుతాడు. వెంకీ నేను క‌లిసి ఒక ఎపిసోడ్ చేద్దాం అనుకుంటే ఇంత పెద్ద సినిమా అయింది`` అని తెలిపారు. వెంకీ నువ్వు వెళ్లు న‌రుక్కు రా అంటే ప‌ని కానిచ్చేసే రోల్ లో క‌నిపించాడని కూడా వెంకీ పాత్ర గురించి చిరు లీక్ ఇచ్చారు. ఏంది వెంకీ సంగ‌తి అంటే.. మ‌న‌దే క‌దా సంక్రాంతి .. ఇర‌గ‌దీద్దాం సాంక్రాంతికి.. అంటూ చాలా ఉత్సాహంగా నాతో క‌లిసి న‌టించాడ‌``ని చిరు వ్యాఖ్యానించారు. మ‌న‌శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు ఈనెల 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే.




Tags:    

Similar News