కీర్తి చక్ర అవార్డు గ్రహీతను కలిసిన మెగాస్టార్.. వీరోచిత పోరాటమే దేశానికి రక్ష!

మెగాస్టార్ చిరంజీవి.. మంచి పనులు చేయడమే కాదు మంచి పనులు చేసిన వారిని కూడా ప్రశంసిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.;

Update: 2025-09-16 10:54 GMT

మెగాస్టార్ చిరంజీవి.. మంచి పనులు చేయడమే కాదు మంచి పనులు చేసిన వారిని కూడా ప్రశంసిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తనకు నచ్చిన విషయాన్ని నిర్మొహమాటంగా చెబుతూ ముందడుగు వేస్తున్న ఈయన తాజాగా "కీర్తి చక్ర అవార్డు" గ్రహీతను కలసి "మీ వీరోచిత పోరాటమే దేశానికి రక్ష" అంటూ వారిపై ప్రశంసలు కురిపించారు.అసలు విషయంలోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి తాజాగా కీర్తి చక్ర అవార్డు గ్రహీత మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడు పై ప్రశంసలు కురిపించారు.

గోపాల్ నాయుడు తన అభిమాని కావడం ఎంతో గర్వంగా ఉందని, దేశ రక్షణలో ఎప్పుడూ ముందుండే రియల్ హీరో తనను కలవడం మరింత సంతోషంగా ఉందని చిరంజీవి తెలిపారు. అంతేకాదు చిరంజీవి రామ్ గోపాల్ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు.

చిరంజీవి ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "అతి చిన్న వయసులోనే దేశ రక్షణ కోసం రామ్ గోపాల్ చూపించిన శౌర్య పరాక్రమాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిని ఇస్తాయి. దేశమాత రక్షణలో ఉన్న ఒక గొప్ప సైనికుడు నా అభిమాని కావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన అభిమానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను, ఆయన కుటుంబం , ఆయన ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నాను" అంటూ చిరంజీవి తెలిపారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కీర్తి చక్ర అవార్డు గ్రహీత మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడు విషయానికి వస్తే.. జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద జరిగిన దాడులలో పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుబెట్టి , తోటి సైనికులను రక్షించుకోవడంలో అత్యంత ధైర్యసహసాలు ప్రదర్శించినందుకుగాను ఈయనకు ఇటీవల కీర్తి చక్ర అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఈయన తన భార్యతో కలిసి చిరంజీవిని కలవడంతోనే ఆయన ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ వారిపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకర వరప్రసాద్ గారు' అనే సినిమా చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం లో వస్తున్న ఈ చిత్రాన్ని సాహూ గారపాటి షైన్ స్క్రీన్ బ్యానర్ పై అలాగే తన కూతురు సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత గతంలోనే ప్రకటించిన ' విశ్వంభర' సినిమా వశిష్ట మల్లిడి దర్శకత్వంలో వస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయబోతున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత బాబి డైరెక్షన్లో చిరంజీవి తన కొత్త సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News