మెగాస్టార్ మెచ్చిన యంగ్ హీరో ఎవరంటే?
ఈ సంక్రాంతి బరిలో టాలీవుడ్ లో పలు సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, రాజా సాబ్, అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి ఉన్నాయి.;
ఈ సంక్రాంతి బరిలో టాలీవుడ్ లో పలు సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, రాజా సాబ్, అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి ఉన్నాయి. వీటిలో రాజా సాబ్ తప్పించి మిగిలిన అన్ని సినిమాలకు మంచి టాక్ వచ్చింది. మెగాస్టార్ సినిమా ఈ ఇయర్ సంక్రాంతి విన్నర్ గా నిలవగా, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు కూడా మంచి కలెక్షన్లతో సూపర్ హిట్ గా నిలిచింది.
హిట్ టాక్ తెచ్చుకున్న అనగనగా ఒక రాజు
నవీన్ పోలిశెట్టి హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి మౌత్ టాక్ తో కామెడీ ఎంటర్టైనర్ గా నిలిచింది. సినిమా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ పేరిట ఓ ఈవెంట్ ను నిర్వహించగా, ఆ ఈవెంట్ కు డైరెక్టర్ బాబీ గెస్టుగా హాజరయ్యారు. మామూలుగా అయితే బాబీ తన హీరోలకు తప్ప వేరే ఈవెంట్లలో ఎవరికీ పెద్దగా ఎలివేషన్లు ఇస్తూ మాట్లాడింది లేదు.
కానీ ఈ ఈవెంట్ లో బాబీ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి. బాబీ నోట చిరంజీవి మాట రావడం వల్లే అతని స్పీచ్ స్పెషల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవితో బాబీ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిస్కషన్స్ సందర్భంగా రీసెంట్ గా మెగాస్టార్ ను బాబీ కలిశారట.
ఆ సమయంలో బాబీని నవీన్ పోలిశెట్టి సినిమా గురించి అడిగి మరీ తెలుసుకున్నారని, అనగనగా ఒక రాజు ఎలా ఉందని అడిగితే చాలా బావుందని చెప్పానన్నానని, అవును నవీన్ ఎంత ఎనర్జిటిక్ గా ఉంటాడో, ఈ జెనరేషన్ లో వస్తున్న హీరోల్లో నాకు నచ్చిన హీరో అతనేనని చిరంజీవి చెప్పారని, తన సినిమా మన శంకరవరప్రసాద్ గారు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ కూడా నవీన్ విజయాన్ని ఆస్వాదిస్తున్నారని బాబీ చెప్పారు.
ఈ విషయాన్ని డైరెక్ట్ గా స్టేజ్ మీద చెప్పాలనే కారణంతోనే ఇప్పటివరకు నవీన్ కు కూడా చెప్పలేదని బాబీ చెప్పడంతో నవీన్ మురిసిపోయారు. మామూలుగా ఈ జెనరేషన్ హీరోలకు మెగాస్టార్ లాంటి సీనియర్ హీరో ప్రశంస అనేది చాలా పెద్ద అఛీవ్‌మెంట్ లాంటిది. అది కూడా డైరెక్ట్ గా కాకుండా వేరొకరి దగ్గర పేరు తీసుకొచ్చి మరీ మెగాస్టార్ ప్రశింసించడంతో నవీన్ కు ఆ మెగా మూమెంట్ మరింత స్పెషల్ గా మారింది.