చిరంజీవి-నాగార్జున మల్టీస్టారర్!
మెగాస్టార్ చిరంజీవి- కింగ్ నాగార్జునలను ఒకే ప్రేమ్ లో చూడాలని మెగా-అక్కినేని అభిమానులు ఎంతగా ఆశపడుతున్నారో? మాటల్లో చెప్పలేనిది.;
మెగాస్టార్ చిరంజీవి- కింగ్ నాగార్జునలను ఒకే ప్రేమ్ లో చూడాలని మెగా-అక్కినేని అభిమానులు ఎంతగా ఆశపడుతున్నారో? మాటల్లో చెప్పలేనిది. ఇండస్ట్రీలో ఇద్దరు బెస్ట్ ప్రెండ్స్ కావడంతో ఆ కలయికను వెండి తెరపై చూడాలని ఎంతో ఆశిస్తున్నారు. ఆ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు ఉంటుందా? అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందో చూడాలి. కానీ ఈ కాంబినేషన్ ని తెరపై ఆవిష్కరించిన దర్శకుడు మాత్రం ఎంతో అదృష్టవంతుడై ఉండాలి.
చిరు-నాగ్ లను ఒకే సారి డైరెక్ట్ చేయడం అంటే అతడు పెట్టి పుట్టి ఉండాలి. ఆ అదృష్టవంతుడు ఎవరవుతారో చూడాలి. అలాగని కేవలం సీనియర్లకే సాధ్యమతుందా? అంటే అలాగని చెప్పలేని పరిస్థితి. నాగా ర్జున కొత్త దర్శకుల్ని ప్రోత్సహించడంలో ముందుంటారు. ఈ మధ్య కాలంలో చిరంజీవి కూడా అలాంటి వాళ్లను బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. కథనచ్చి అతడిపై నమ్మకముంటే వెళ్లిపోతున్నారు.
సీనియర్ల కంటే వీళ్లే బెటర్ అన్న ధోరణి చిరు లో కనిపిస్తుంది. కాబట్టి డైరెక్ట్ చేసే అవకాశం కేవలం సీనియ ర్లకే కాదు...కొత్త వాళ్లకు కూడా ఉంటుంది. కనీసం ఒక సినిమా అయినా చేసి ఉంటే అవకాశం ఈజీ అవుతుంది. చిరు-నాగ్ ల ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని సరైన స్క్రిప్ట్ తో అప్రోచ్ అయితే కొత్త రైటర్లకు అవ కాశం లేకపోలేదు. నేరుగా ఛాన్స్ రాకపోయినా? అతడి ఎంట్రీకి ఈ అవకాశం అన్నది దోహదం చేస్తుంది.
ఇండస్ట్రీ విధానం మారిన నేపథ్యంలో రైటర్ నుంచి డైరెక్టర్ అవ్వడం పెద్ద విషయం కాదు. చిరు-నాగ్ లను కలపాలని గతంలోనే ఈవీవీ సత్యానారాయణ ఓ ప్రయత్నం చేసారు. కానీ సెట్ అవ్వ లేదు. అప్పటి నుం చి మరో డైరెక్టర్ అలాంటి ప్రయత్నాలు చేయలేదు. మరి ఇప్పుడా ఛాన్స్ ఎవరు తీసుకుంటారో చూడాలి.