• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ముఠామేస్త్రి రీ-రిలీజ్‌కు...

ముఠామేస్త్రి రీ-రిలీజ్‌కు రెడీ.. ఈసారి క్వాలిటీ జాగ్రత్త మేస్త్రి!

| టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఇంకో పదకొండు రోజుల్లో రాబోతోంది. ఈ సందర్భంగా మెగా అభిమానుల్లో ఆశలు, అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

By - Madhu Reddy
Update: 2026-08-11 09:43 GMT

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఇంకో పదకొండు రోజుల్లో రాబోతోంది. ఈ సందర్భంగా మెగా అభిమానుల్లో ఆశలు, అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 'మెగా 158' నుంచి టీజర్ వస్తుందని థమన్, బాబీ ఇప్పటికే హింట్ ఇచ్చేశారు. ఇక 'విశ్వంభర' సినిమా విడుదల తేదీని కూడా అక్టోబర్ 16న అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కానీ, వీటన్నింటితో పాటు అభిమానులను అలరించేందుకు మెగాస్టార్ కల్ట్ క్లాసిక్ సినిమా 'ముఠామేస్త్రి' రీ-రిలీజ్‌కు సిద్ధమవుతుండటం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఆ విశేషాలు చూద్దాం..

ఆగస్ట్ 21న థియేటర్లలోకి 'ముఠామేస్త్రి':

ఆగస్ట్ 21న 'ముఠామేస్త్రి' చిత్రాన్ని రీ-రిలీజ్ చేయడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1993లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించింది. చిరంజీవి రాజకీయ రంగప్రవేశంపై తీవ్రమైన చర్చ నడుస్తున్న సమయంలో వచ్చి, ఆయనను ఎమ్మెల్యేగా, మంత్రిగా చూపించిన ఈ చిత్రం అభిమానులకు బాగా కనెక్ట్ అయింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ మాస్ వినోదాన్ని వెండితెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

క్వాలిటీ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి:

గతంలో చిరంజీవి నటించిన 'ఘరానా మొగుడు', 'జగదేకవీరుడు అతిలోకసుందరి', 'గ్యాంగ్ లీడర్' చిత్రాలను రీ-రిలీజ్ చేసినప్పుడు సరైన క్వాలిటీ లేక అభిమానులు తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రింట్లు సరిగా లేకపోవడం ఆ అనుభూతిని దెబ్బతీసింది. అయితే 'కొదమసింహం' చిత్రాన్ని మాత్రం అద్భుతమైన 4K నాణ్యతతో రీమాస్టర్ చేశారు. ఇక ఇప్పుడు 'ముఠామేస్త్రి' విషయంలో కూడా అదే తరహా క్వాలిటీ జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ప్రమోషన్లకు భలే అవకాశం:

ఆగస్ట్ 22న 'శంకర్ దాదా ఎంబీబీఎస్' కూడా థియేటర్లలోకి వస్తున్నప్పటికీ, అది ఇప్పటికే ఒకసారి రీ-రిలీజ్ అయింది కాబట్టి ఫ్యాన్స్ ఫోకస్ 'ముఠామేస్త్రి' పైనే ఉంది. ఇక ఈ చిత్రంలో నటించిన మీనా, రోజా, బ్రహ్మానందం, బాబు మోహన్ వంటి ప్రముఖ నటులంతా అందుబాటులోనే ఉన్నారు. వీరందరితో వీడియో బైట్లు, ప్రత్యేక ప్రమోషన్ ఈవెంట్లు ప్లాన్ చేస్తే సినిమాకు మరింత ఊపు వస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు 'ముఠామేస్త్రి' రీ-రిలీజ్ ఒక మంచి ఆరంభం కానుంది. అయితే కేవలం థియేటర్లలో వేయడమే కాకుండా, క్వాలిటీ విజన్, సరైన పబ్లిసిటీతో వస్తే మాత్రం ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం.

Tags:    
  • chiranjeevi 
  • mutamestri 
  • mutamestrirerelease 
  • megastar 
  • chiranjeevibirthday 
  • tollywood 

Similar News

N-క‌న్వెన్ష‌న్‌ని కూల్చివేసినా కానీ కింగ్ నాగార్జున ఏంటి ఇలా?!

2026-11-12 02:25 GMT

అనిరుధ్ పెళ్లిలో స్టెప్పులు.. ఏజ్‌లెస్ హీరోకి కిక్కు ఎక్కెరా!

2026-11-12 02:16 GMT

అందాల ఆమ‌ని స్టార్ హీరోల‌కు దూరంగా!

2026-11-11 22:30 GMT

డేట్ నైట్స్ సీక్రెట్స్ బయటపెట్టిన కియారా-సిద్ధార్థ్!

2026-11-11 19:30 GMT

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

టీటీడీ చైర్మ‌న్ రేసులో సినీ ప్ర‌ముఖులు.. !

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

Copyright @2026

Powered by Blink CMS