కన్నుకొట్టి మొదలెట్టిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి, మాస్ ఎంటర్టైనర్ స్పెషలిస్టు అనిల్ రవిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 'మెగా157' చిత్రం ఇటీవల అధికారికంగా అనౌన్స్ అయినప్పటి నుంచే భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తోంది.;
మెగాస్టార్ చిరంజీవి, మాస్ ఎంటర్టైనర్ స్పెషలిస్టు అనిల్ రవిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 'మెగా157' చిత్రం ఇటీవల అధికారికంగా అనౌన్స్ అయినప్పటి నుంచే భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటివరకు ఇద్దరూ కలిసి పనిచేయకపోయినా, ఈ కాంబోపై మెగా అభిమానుల ఆశలు అమాంతంగా పెరిగిపోయాయి. చిరు కోసం ఓ ఫ్రెష్ స్క్రిప్ట్, పూర్తి స్థాయి వినోదంతో కూడిన చిత్రం వస్తుందనే నమ్మకంతో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఇక శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. మొదటి రోజు నుంచే షూటింగ్‌కి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తూ మెగాస్టార్ సెట్ లో అడుగుపెట్టారు. చిత్ర బృందం ప్రొడక్షన్ పనులను శరవేగంగా మొదలుపెట్టింది. ముఖ్యంగా మెగా అభిమానుల కోసం ఒక ప్రత్యేకమైన ఎంటర్టైనింగ్ ఎపిసోడ్‌తో షూటింగ్ ప్రారంభించారట.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన క్లాప్ బోర్డ్ GIF ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగాస్టార్ కన్నుకొట్టగా మెగా157 క్లాప్ బోర్డ్ పడింది. మెగాస్టార్ చిరంజీవి తన కళ్లతో ఇచ్చిన ఇంటెన్స్ లుక్ చూస్తుంటే మంచి మాస్ ఎంటర్టైన్మెంట్ రెడీ కానున్నట్లు అర్ధమవుతుంది. ఈ ఒక్క ఫ్రేమ్‌తోనే సినిమా మీద అంచనాలు రెట్టింపయ్యాయి. అలాగే ఈ సినిమా టైటిల్‌పై ప్రస్తుతం భారీ చర్చ నడుస్తోంది. ‘రఫ్ఫాడిద్దాం’ అనే తరహాలో టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ట్యాగ్‌లైన్, టోన్ చూస్తుంటే అది అనిల్ రవిపూడి మార్క్‌నే గుర్తు చేస్తోంది.
ఈ సినిమాను సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. మాస్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఓ పక్కా థియేట్రికల్ ఎంటర్టైనర్‌గా చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నయనతార లీడ్ రోల్‌లో నటించనున్నట్లు కన్ఫర్మ్ కాగా, మరిన్ని పాత్రల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. దర్శకుడు అనిల్ రవిపూడి ఈ సినిమాను భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్నాడు.
ఈ చిత్రం వచ్చే సంక్రాంతి 2026 సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ పండుగ సీజన్‌లో మెగాస్టార్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయనున్నారన్న టాక్ స్పష్టంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌పై నిర్మాణ బృందం పూర్తి దృష్టి పెట్టగా, రెగ్యులర్ అప్‌డేట్స్‌తో ప్రేక్షకుల ఉత్కంఠను కొనసాగించనున్నారు. ఇక 'మెగా157' రాబోయే రోజుల్లో అప్డేట్స్ తో ఇంకెంత హైప్ క్తియేట్ చేస్తుందో చూడాలి.