ముస్సోరీలో ముగించిన మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి 157వ చిత్రం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.;
మెగాస్టార్ చిరంజీవి 157వ చిత్రం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభించిన యూనిట్ అటుపై రెండవ షెడ్యూల్ కోసం ముస్సోరీ లో మొదలు పెట్టింది. తాజాగా ముస్సోరీ షెడ్యూల్ పూర్తయింది. ఈ విషయాన్ని చిరంజీవి ట్విటర్ ద్వారా రివీల్ చేసారు. ఈ షెడ్యూల్ లో చిరంజీవి సహా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
సినిమాలో ఈ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. దీంతో రెండు షెడ్యూళ్ల షూటింగ్ పూర్తయింది. తదుపరి కొత్త షెడ్యూల్ ఎక్కడ మొదలవుతుంది? అన్నది మాత్రం రివీల్ చేయలేదు. హైదరాబాద్ లో ఉంటుందా? విదేశీ షెడ్యూల్ ఏమైనా ఉన్నాయా? అన్నది తెలియాలి. ఈ సిని మాలో చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపించనున్నారు.
శారీరకంగా చిరంజీవి చాలా మార్పులు తీసు కొచ్చారు. ఫిట్ నెస్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టి మునుపటి చిరంజీవిని తలపిస్తున్నారు. నయనతార కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇద్దరి కాంబి నేషన్ లో రాబోతున్న మూడవ చిత్రమిది. సినిమా ప్రారంభానికి ముందే నయన్ ప్రచారం పనుల్లో భాగ స్వామ్యం కావడం సినిమాకు బోలెడంత పబ్లిసిటీని తెచ్చి పెట్టింది.
అదే ఉత్సాహంతో షూటింగ్ లోనూ పాల్గోంటుంది. సినిమాలో నయనతార పాత్ర ఎలా ఉంటుంది? అనీల్ రావిపూడి ఎలాంటి రోల్ డిజైన్ చేసాడనే సస్పెన్స్ కొనసాగుతుంది. అలాగే మరో హీరోయిన్ గా క్యాథరీన్ నటిస్తోంది. ఇందులో అమ్మడు పవర్ పుల్ పాత్రలో కనిపించనుంది. ఆన్ సెట్స్ లో ఆమె ఎంట్రీకి సంబం ధించి ఇంకా ఎలాంటి అప్ డేట్ రాలేదు.