• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగాస్టార్ తో పెద్ది...

మెగాస్టార్ తో పెద్ది టెక్నీషియన్.. అనిల్ హై వోల్టేజ్ ప్లాన్!

| ‘మెగా 157’లో ప్రారంభ సన్నివేశాల నుంచే భారీ యాక్షన్ షాట్స్ తెరకెక్కిస్తున్నారని ఫిలింనగర్‌లో బజ్.

By - Tupaki Desk
Update: 2025-05-26 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి మరో క్రేజీ ప్రాజెక్టును లైన్ లో పెట్టారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మెగా ప్రాజెక్ట్ ‘మెగా 157’ ఇటీవలే పూజా కార్యక్రమాలతో అధికారికంగా లాంఛనంగా మొదలైంది. నయనతార ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనుండటంతో అభిమానుల్లో ఆసక్తి మళ్లీ పెరిగింది. ‘సైరా’, ‘గాడ్‌ఫాదర్’ తర్వాత మెగాస్టార్‌తో నయనతార కలిసి నటిస్తున్న మూడో సినిమా ఇది కావడం విశేషం.

తాజాగా ఈ సినిమాలో ఓ ఆసక్తికరమైన అంశం రివీల్ అయ్యింది. రామ్ చరణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమాలోని ఓపెనింగ్ షాట్‌ను వైరల్‌ చేసిన యాక్షన్ డైరెక్టర్ నబా కాంత మెతీ ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా ఎంట్రీ ఇచ్చారు. 'పుష్ప 2' సినిమాలో క్లైమాక్స్, జాతర ఎపిసోడ్స్‌ను మెస్మరైజ్ చేసే విధంగా డిజైన్ చేసిన ఆయన.. ‘ఆచార్య’, ‘వాల్తేరు వీరయ్య’లో చిరుతో పనిచేసిన అనుభవంతో ఈసారి మరింత స్థాయిలో యాక్షన్‌ను చూపించబోతున్నారని టాక్.

‘మెగా 157’లో ప్రారంభ సన్నివేశాల నుంచే భారీ యాక్షన్ షాట్స్ తెరకెక్కిస్తున్నారని ఫిలింనగర్‌లో బజ్. ఈ క్రమంలో నబా కాంత మెతీ అద్భుతమైన విజువల్స్‌ను అందించబోతున్నారని సమాచారం. బుచ్చి బాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమా ద్వారా ఆయన పేరు ఎక్కువగా బయటకు రావడంతో.. ఇప్పుడు ‘మెగా 157’లో ఆయనపై మరింత ఆశలు పెట్టుకున్నారు అభిమానులు.

ఈ భారీ మాస్ ఎంటర్‌టైనర్‌ను సాహు గారపాటి తన ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్’ ద్వారా సహనిర్మాణ బాధ్యతలు చేపట్టారు. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించనుండగా.. అనిల్ రావిపూడి మార్క్ వినోదంతో పాటు చిరంజీవి మాస్ పర్‌ఫార్మెన్స్‌ను హైలైట్ చేసేలా ఈ కథ సాగనుందట.

2026లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌ను లక్ష్యంగా తీసుకుని ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఫస్ట్ షెడ్యూల్‌లోనే భారీ యాక్షన్ పార్ట్‌తో మెగా ఫ్యాన్స్‌కి పండుగలా మారనుంది. ఇక ఈ సినిమాలో చిరుతో పాటు మిగతా క్యాస్ట్‌, ఫుల్ లెవెల్ ప్రమోషన్లు ఎలా ఉంటాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. మొత్తానికి ‘పెద్ది’ తర్వాత అదే టెక్నీషియన్ మళ్లీ మెగాస్టార్ చిత్రానికి వస్తుండటంతో.. ఈసారి ఆయన డిజైన్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో చూడాల్సిందే.

Tags:    
  • Mega157 
  • Chiranjeevi 
  • AnilRavipudi 
  • Nayanthara 
  • RamCharan 
  • Peddhi 
  • NabhaKantaMethi 
  • MassAction 
  • Tollywood 
  • MegaStarMovie 

Similar News

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

పిల్లి కళ్ల భామకు వరుస అవకాశాలు..!

2026-11-03 17:54 GMT

Copyright @2026

Powered by Blink CMS