శంకరవరప్రసాద్ న్యూ ప్లాన్.. అంతా ఓకే కానీ..

మెగాస్టార్ చిరంజీవి చాలా గ్యాప్ తర్వాత స్క్రీన్ మీద కనిపించబోతున్న సినిమా 'మన శంకరవరప్రసాద్ గారు'.;

Update: 2025-12-24 10:30 GMT

మెగాస్టార్ చిరంజీవి చాలా గ్యాప్ తర్వాత స్క్రీన్ మీద కనిపించబోతున్న సినిమా 'మన శంకరవరప్రసాద్ గారు'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సంక్రాంతి సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ సైలెంట్ గా ఉన్నా, ఇంటర్నల్ గా మాత్రం ఒక డేరింగ్ స్టెప్ వేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అదే పెయిడ్ ప్రీమియర్స్.

ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ సినిమాను రిలీజ్ కు ఒక రోజు ముందే, అంటే జనవరి 11 రాత్రికే ప్రీమియర్స్ వేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ప్రభాస్ 'రాజా సాబ్' ఇదే రూట్ లో వెళ్తోంది. ఇప్పుడు మన శంకరవరప్రసాద్ గారు కూడా అదే దారిలో వెళ్తే ఎలా ఉంటుంది అనే చర్చ నడుస్తోంది. అయితే ఇది డేంజర్ స్టెప్ అనే టాక్ కూడా ఉంది.

ఎందుకంటే రీసెంట్ గా 'అఖండ తాండవం 2' సినిమాకు ఇలాగే ముందు రోజు ప్రీమియర్స్ వేశారు. కానీ అర్ధరాత్రికే మిక్స్డ్ టాక్ రావడంతో అది సినిమా ఓపెనింగ్స్ మీద, లాంగ్ రన్ మీద గట్టి ప్రభావం చూపించింది. కంటెంట్ ఏమాత్రం తేడా కొట్టినా, ప్రీమియర్స్ లో వచ్చే టాక్ సినిమాను దెబ్బతీస్తుంది. మరి మెగా కాంపౌండ్ ఆ రిస్క్ ని ఎలా తీసుకుంటుంది అనేది ఆసక్తికరం.

దీనికి తోడు టికెట్ రేట్ల గొడవ కూడా ఉంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇకపై స్పెషల్ షోలు, రేట్ల పెంపు ఉండదని బాంబ్ పేల్చారు. ఒకవేళ ప్రభాస్ సినిమాకు పర్మిషన్ వస్తే, ఆటోమేటిక్ గా చిరంజీవికి కూడా వస్తుంది. కానీ భారీ విజువల్స్ ఉన్న సినిమాకు, ఇలాంటి కమర్షియల్ ఎంటర్టైనర్ కు ఒకే రకమైన రేట్లు పెంచితే ఆడియెన్స్ రిసీవ్ చేసుకుంటారా అనేది చూడాలి.

ఇన్ని రిస్కులు ఉన్నా టీమ్ కాన్ఫిడెంట్ గా ఉండటానికి కారణం ఒక్కడే.. అనిల్ రావిపూడి. ఆయనకు బాక్సాఫీస్ దగ్గర మినిమం గ్యారెంటీ అనే బ్రాండ్ ఉంది. ఆడియెన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్ కాబట్టి, ఆ ధైర్యంతోనే ప్రీమియర్స్ కు వెళ్తున్నారని సమాచారం. పైగా జనవరి 1 నుంచి వెంకటేశ్ చిరుల పాట, నయనతార ఇంటర్వ్యూలతో ప్రమోషన్స్ పీక్స్ కు తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నారు.

దాదాపు రెండేళ్ళ గ్యాప్ తర్వాత బాస్ వస్తున్నారు కాబట్టి ఆకలి మీద ఉన్న ఫ్యాన్స్ కు అనిల్ మార్క్ ఎంటర్టైన్మెంట్ దొరికితే మాత్రం వసూళ్ల మోత మోగడం ఖాయం. అప్పుడు ఈ ప్రీమియర్ రిస్క్ కూడా పెద్ద ప్లస్ అవుతుంది. కంటెంట్ కనెక్ట్ అయితే తిరుగుండదు. మరి అనిల్ బ్రాండ్ గెలుస్తుందా లేక ప్రీమియర్ సెంటిమెంట్ భయపెడుతుందా అనేది తెలియాలంటే మరో పది రోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News