కాకా వ‌ర్సెస్ దాదా ఒకేసారి దిగితేనే ఆ కిక్!

టాలీవుడ్‌లో ఎంతమంది హీరోలున్నా? చిరంజీవి-బాల‌య్య మ‌ధ్య బాక్సాఫీస్ స‌మ‌రం అంటే అది వేరే లెవ‌ల్లో ఉంటుంది.

Update: 2026-09-08 18:30 GMT

టాలీవుడ్‌లో ఎంతమంది హీరోలున్నా? చిరంజీవి-బాల‌య్య మ‌ధ్య బాక్సాఫీస్ స‌మ‌రం అంటే అది వేరే లెవ‌ల్లో ఉంటుంది. తాజాగా ఇద్ద‌రి హీరోల అభిమానులు అదే వార్ ను కోరుకుంటున్నారు. `కాకా` వర్సెస్ `దాదా` ఒకేసారి రిలీజ్ అయితే ఆ కిక్ ను ఆస్వాదించాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రెండు సినిమాలూ పక్కా మాస్ ఎంటర్‌టైనర్లుగా రూపొందుతుండటంతో అభిమానుల్లో ఈ మ‌ధ్య కాలంలో ఎన్న‌డు లేనంత భారీ బజ్ నెలకొంది.

థియేటర్లలో ఇద్దరి మాస్ మేనియాను ఒకేసారి చూడాలని, విజిళ్లు, పేపర్ల వర్షంతో థియేటర్లను హోరెత్తించాలని ఇరు వర్గాల అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. గతంలో పెద్ద సినిమాలు పండుగ సీజన్లలో ముఖాముఖి తలపడినప్పుడు వచ్చిన ఓపెనింగ్స్, సృష్టించిన రికార్డులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం విడుదల తేదీల విషయంలో కొంతమంది క్లాష్‌ను నివారించి సోలో రిలీజ్‌కు వెళ్లాలని భావిస్తున్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఇద్దరి పోటీనే కోరుకుంటున్నారు. `పోటీ ఉన్నప్పుడే అసలైన బాక్సాఫీస్ సత్తా ఏంటో తెలుస్తుంది. బాక్సాఫీస్ వద్ద ఆ వేడి, సందడి ఉంటేనే సినిమాకు నిజమైన పండుగ వాతావరణం వస్తుంది` అని కామెంట్స్ చేస్తున్నారు.

ఒకేసారి ఇద్దరు మాస్ మొనగాళ్లు బరిలోకి దిగితే రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కలకలలాడటం ఖాయం. ఇలాంటి మాస్ పోటీ వల్ల బాక్సాఫీస్‌కు చాలా వ‌ర‌కూ మేలు జరుగుతుందని కొంద‌రు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మంచి కంటెంట్ ఉన్నప్పుడు ఎంత పోటీ ఉన్నా? ప్రేక్షకులు రెండు సినిమాలనూ ఆదరిస్తారనేది ఎన్నోసార్లు నిరూపితమైంది. బిజినెస్ పరంగా, ఓపెనింగ్ డే కలెక్షన్ల పరంగా, సోషల్ మీడియా ట్రెండ్స్ పరంగా ఈ క్లాష్ టాలీవుడ్ స్థాయిని మరోసారి పీక్స్‌కు తీసుకెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు.

అయితే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మాత్రం థియేటర్ల కేటాయింపు, కలెక్షన్లలో కోతలు పడకుండా ఉండేందుకు సోలో రన్ కోసం ప్లాన్ చేసే అవకాశం లేకపోలేదు. కానీ రెండు చిత్రాల శైలి, మాస్ అప్పీల్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే రెండింటినీ ఒకేసారి వెండితెరపై అనుభవించడమే అసలైన వినోదమని అభిమానులు పట్టుబడుతున్నారు. ఏది ఏమైనా? `కాకా వర్సెస్ దాదా` బాక్సాఫీస్ క్లాష్‌పై ఇప్పటి వరకు క్లారిటీ రాకపోయినా ఈ ప్రచారం మాత్రం సినీ వర్గాల్లో సెన్సేషన్ సృష్టిస్తోంది. త్వరలోనే చిత్ర యూనిట్లు విడుదల తేదీలపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ మాస్ పోరు నిజమైతే మాత్రం చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో అద్భుతమైన, రికార్డులు తిరగరాసే బాక్సాఫీస్ యుద్ధాన్ని చూసే అవకాశం అభిమానుల‌కు ద‌క్కుతుంది.

Tags:    

Similar News