• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్ బి (X) నాగ్:...

బిగ్ బి (X) నాగ్: చిరంజీవి 'కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా'

| అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో జ‌రిగిన అవార్డుల‌ వేడుక‌లో ఏఎన్నార్ జాతీయ అవార్డును అమితాబ్ చేతుల‌మీదుగా మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు

By - Tupaki Desk
Update: 2024-10-29 03:54 GMT

అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో జ‌రిగిన అవార్డుల‌ వేడుక‌లో ఏఎన్నార్ జాతీయ అవార్డును అమితాబ్ చేతుల‌మీదుగా మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. ప‌రిశ్ర‌మ అతిర‌థ మ‌హార‌థులు ఈ వేడుక‌లో పాల్గొన్నారు.

ఈ వేదిక‌పై అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ఏయన్నార్‌ ఈ మూడు అక్షరాలే నాకు ప్రపంచం. నాకే కాదు మా కుటుంబం, స్నేహితులు, అభిమానులు అందరికీ. మా నాన్న గారు హ్యుమానిటీని నమ్మారు. మనుషుల్ని నమ్మారు. అన్నిటికంటే ముఖ్యంగా సినిమాని బిలీవ్ చేశారు. అభిమానులు, ప్రేక్షకులు మనసులో చిరస్థాయిగా ఒక లెజెండ్ గా నిలిచారు. భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిల్చే అలాంటి గొప్ప వ్యక్తులని గౌరవించడం ఏయన్నార్‌ అవార్డు ముఖ్య ఉద్దేశం. ఈరోజు అలాంటి గొప్ప వ్యక్తులు ఇద్దరు, ఇండియన్ సినిమా ఏ బి సి.. అమితాబచ్చన్ జి, మెగాస్టార్ చిరంజీవి గారిని ఆహ్వానిస్తున్నాను. ఈ ఏడాది నా డియర్ ఫ్రెండ్, పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి అవార్డు ఇవ్వడం ఎంతో ప్రత్యేకం. ఈ అవార్డుని నేను ఎంతగానో ఆరాధించే పద్మ విభూషణ్ అమితాబచ్చన్ గారు ప్రజెంట్ చేయడం ఇంకా స్పెషల్. కొన్నేళ్ల క్రితం అమితాబచ్చన్ గారు ఏఎన్నార్ అవార్డుని అందుకోవడం లు అవార్డు ప్రతిష్టని మరింతగా పెంచింది. ఈరోజు చిరంజీవి గారికి అవార్డు ప్రధానం చేయడానికి అమితాబచ్చన్ గారు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఏఎన్ఆర్ శతజయంతి సందర్భంగా ఇది మాకు ఎంతో ప్రత్యేకం. రీసెంట్ గా కల్కి సినిమా చూశాను. అమితాబచ్చన్ గారిని అశ్వద్ధామ చూసినప్పుడు మా ఒరిజినల్ మాస్ హీరో ఇస్ బ్యాక్ అనిపించింది. ఇదే విషయం ఆయనకి కాల్ చేసి చెప్పాను. ఆయన ఎంతో ఆనందంగా నవ్వారు. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అమితాబచ్చన్ గారి స్క్రీన్ ప్రజెంట్, మేనరిజం, ఇంపాక్ట్ సింప్లీ అండ్ అన్ టచబుల్. అమితాబ్ బచ్చన్ గారు ఎన్నో సామాజిక కార్యక్రమాలకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నారు. హ్యాట్సాఫ్ అమితాబచ్చన్ గారు. మై డియర్ ఫ్రెండ్ చిరంజీవి గారితో నాకు ఎన్నో బ్యూటిఫుల్ మెమోరీస్ ఉన్నాయి. ఆయన సినిమాలు గురించి మీ అందరికీ తెలుసు ఆయన హిట్లు సూపర్ హిట్లు బ్రేక్ చేసిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఈమధ్య గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా ఎక్కారు.

నేను సినిమాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు.. నాన్నగారు ఒకసారి అన్నపూర్ణ స్టూడియోస్ లో చిరంజీవి గారి షూటింగ్ జరుగుతుంటే ఆయన డాన్స్ ని చూడమని నాకు చెప్పారు. అప్పుడు రెయిన్ సాంగ్ జరుగుతుంది. చిరంజీవి గారి డాన్స్, గ్రేస్ చూసి నాకు కొంచెం గుబులు పుట్టింది. ఆయనలాగా డాన్స్ చేయగలనా అనిపించింది. అలా ఆయనతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. చిరంజీవి గారి స్పెక్టాక్యులర్ సినిమా జర్నీ మనందరికీ తెలుసు. అలాగే ఆయన వెలకట్టలేని సామాజిక సేవ కార్యక్రమాలు ఎన్నో చేశారు. చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఎంతోమంది ప్రాణాలను కాపాడింది. కోవిడ్ టైంలో ఫిలిం వర్కర్స్ అందరికీ ఒక దారి చూపించారు. నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్తుండేవారు. మనం సొసైటీ నుంచి ఏదైనా తీసుకున్నప్పుడు మళ్లీ తిరిగి ఇవ్వాల్సి బాధ్యత మన మీద ఉంటుందని. చిరంజీవి గారు, అమితాబచ్చన్ గారు అదే చేసి చూపించారు. అమితాబ్ బచ్చన్ గారు చిరంజీవి గారిని కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని పిలిచారు. అది ముమ్మాటికి నిజం. ఇలాంటి ఈ వేదికపై ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది అమితాబచ్చన్ గారు ఏఎన్ఆర్ అవార్డు ని చిరంజీవి గారిని చిరంజీవి గారికి ప్రజెంట్ చేయడం మా అందరికీ ఎంతో సంతోషం. కీరవాణి గారు మా ఫాదర్ జర్నీ ని వారి మ్యూజిక్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. థాంక్యూ కీరవాణి గారు. ఈ వేడుకకి విచ్చేసిన స్నేహితులు, సినీ పరిశ్రమ ప్రముఖులు, మీడియా మిత్రులు అందరికీ స్వాగతం. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. థాంక్యూ ఆల్. ఏఎన్ఆర్ లీవ్స్ ఆన్`` అని అన్నారు

ఈ అవార్డు వేడుకలో ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ని ప్రత్యేకంగా సన్మానించారు. హీరోలు వెంకటేష్, రామ్ చరణ్, నాని, సిద్దు జొన్నలగడ్డ, సుధీర్ బాబు, దర్శకులు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, నాగ్ అశ్విన్, చందూమొండేటి, నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, శ్యాం ప్రసాద్ రెడ్డి, టీజీ విశ్వప్రసాద్, సునీల్ నారంగ్, స్వప్న దత్, హీరోయిన్స్ రమ్యకృష్ణ, శ్రీలీల, నటులు ప్రకాష్ రాజ్, మురళిమోహన్, అలీ, రాజేంద్రప్రసాద్, రైటర్ విజయేంద్రప్రసాద్, అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు అనేక మంది ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకు మహా అద్భుతంగా జరిగింది.

Tags:    
  • Amitabhbachchan 
  • Telugufilmindustry 
  • Amitabh 
  • Anrnationalawards 
  • Anrnationalawards2024 
  • Chiranjeevi 
  • Nagarjuna 
  • ANR 
  • Venkatesh 
  • Ramcharan 
  • Tollywood 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS