'కాకా'లో ఆ పాత్ర హైలైట్‌ కానుందట..!

ఈ సినిమాలో చిరంజీవి పాత్ర గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ మధ్య కాలంలో చిరంజీవి ని చూడని విభిన్నమైన పాత్రలో బాబీ చూపించబోతున్నాడు అంటున్నారు.

Update: 2026-08-31 10:30 GMT

మెగాస్టార్‌ చిరంజీవి 2026 సంక్రాంతికి 'మన శంకరవర ప్రసాద్‌ గారు' సినిమాతో వచ్చి సూపర్‌ హిట్‌ను అందుకున్న విషయం తెల్సిందే. అదే జోష్‌తో 2027 సంక్రాంతికి సూపర్‌ హిట్‌ కొట్టడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే తనకు ఒక హిట్ ఇచ్చిన దర్శకుడు బాబీ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి సినిమా చేస్తున్నారు. వీరి కాంబో మూవీకి 'కాకా' అంటూ టైటిల్‌ను ఖరారు చేయడం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ మధ్య కాలంలో చిరంజీవి ని చూడని విభిన్నమైన పాత్రలో బాబీ చూపించబోతున్నాడు అంటున్నారు. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో చిరంజీవి డ్యూయెల్‌ రోల్‌లో కనిపించబోతున్నాడట. రెండు పాత్రల్లోనూ చిరంజీవి లుక్‌ విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అంటూ యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.

చిరంజీవి కాకా లుక్‌తో సర్‌ప్రైజ్‌...

'కాకా' సినిమాలో చిరంజీవి టీనేజ్‌ అమ్మాయికి తండ్రి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరో పాత్ర యంగ్‌ లుక్‌లో ఉంటుందట. రెండు పాత్రలు దేనికి అదే అన్నట్టుగా కథలో అత్యంత కీలకంగా ఉంటాయని అంటున్నారు. అయితే మిడిల్‌ ఏజ్‌ పాత్ర అయిన కాకా మాత్రం సినిమాకు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్‌ సభ్యులు ఆఫ్‌ ది రికార్డ్‌ చెబుతున్నారు. ఆ పాత్ర పండించే కామెడీ, ఎమోషన్స్‌, యాక్షన్ ఇలా ప్రతి ఒక్కటి కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని, సంక్రాంతికి వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్‌ ను అలరించబోయేది ఆ కాకా పాత్ర అని కూడా యూనిట్‌ సభ్యులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. రెండో పాత్రతో పోల్చితే కాకా పాత్ర సినిమాలో ఎక్కువ సమయం కనిపించేలా దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నాడట. ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో డైలాగ్స్ సైతం స్పెషల్‌ కేర్‌ తీసుకుని రాశారని చెబుతున్నారు.

డ్యూయెల్‌ రోల్‌లో మెగాస్టార్‌ చిరంజీవి...

చిరంజీవి మిడిల్ ఏజ్‌ లుక్‌లో ఎలా కనిపిస్తాడో గతంలో పలు సినిమాల్లో చూశాం. అయితే ఈ సినిమా టైటిల్ రిలీజ్‌ గ్లిమ్స్‌లో లుక్‌తో సర్‌ప్రైజ్‌ చేశాడు. ఒక బిడ్డకు తండ్రిగా బాధ్యత గా ఉంటూనే మరో వైపు సమాజం పట్ల బాధ్యత గల వ్యక్తిగా కాకా పాత్రను దర్శకుడు బాబీ డిజైన్‌ చేశాడని అంటున్నారు. చిరంజీవి రెండు పాత్రల్లోనూ నటుడిగా జీవించడం ఖాయం అని, అయితే కాకా పాత్ర వయసు తన నిజ జీవిత వయసుకు దగ్గరగా ఉంటుంది కనుక చిరంజీవి మరింతగా కనెక్ట్‌ అయ్యి నటించే అవకాశాలు ఉన్నాయి. ఒక తండ్రిగా చిరంజీవి నిజ జీవితంలోనూ పాత్ర పోషిస్తున్నాడు, కనుక సినిమాలో చిరంజీవి తండ్రి పాత్రలో ఎలా నటిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో మరో వైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెబుతున్నారు.

సంక్రాంతి కానుకగా కాకా మూవీ...

'కాకా' సినిమాను ఆగస్టు చివరి వరకు షూటింగ్‌ పూర్తి చేసి, డిసెంబర్‌లోనే ఫస్ట్‌ కాపీ రెడీ చేయాలని దర్శకుడు బాబీ భావిస్తున్నాడు. చాలా స్పీడ్‌గా సినిమా షూటింగ్‌ పూర్తి చేసిన బాబీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ విషయంలోనూ ఏమాత్రం అలసత్వం కనబర్చడం లేదు. చిరంజీవి స్క్రీన్‌ పై ఒకే సారి రెండు పాత్రల్లో కనిపించే సన్నివేశాలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ కనబర్చుతున్నారని తెలుస్తోంది. కొత్త టెక్నాలజీని వాడి డ్యూయెల్‌ రోల్‌ సీన్స్ చేశారని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. తప్పకుండా ఈ సినిమా మెగాస్టార్‌ ఫ్యాన్స్ కి డబుల్‌ ధమాకా అనడంలో సందేహం లేదు. 2027 సంక్రాంతికి ఎంత పోటీ ఉన్నా మెగాస్టార్‌ చిరంజీవి సినిమా తర్వాతే ఇతర సినిమాలన్నీ అంటూ మెగా ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. కేవీఎన్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. సెప్టెంబర్‌లో మొదటి పాటను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. జనవరి 13, 2027 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.

Tags:    

Similar News