చిరూ మూవీలో ఆయన లేనట్టేనా?
అనిల్ మూవీని ఇప్పటికే పూర్తి చేసిన చిరూ, తన నెక్ట్స్ మూవీని బాబీ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే.;
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సాలిడ్ లైనప్ తో చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సోషియో ఫాంటసీ సినిమాను పూర్తి చేసిన చిరూ, ప్రస్తుతం టాలీవుడ్ హిట్ మిషన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకరవరప్రసాద్ గారు అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది.
జనవరి 12న మన శంకరవరప్రసాద్ గారు రిలీజ్
సంక్రాంతి కానుకగా జనవరి 12న మన శంకరవరప్రసాద్ గారు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన టైటిల్ గ్లింప్స్, పోస్టర్లు, సాంగ్స్, ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అనిల్ ఈ సినిమాలో వింటేజ్ చిరూని ప్రెజెంట్ చేశారని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అనిల్ మూవీని ఇప్పటికే పూర్తి చేసిన చిరూ, తన నెక్ట్స్ మూవీని బాబీ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే.
బ్లాక్ బస్టర్ గా నిలిచిన వాల్తేరు వీరయ్య
ఆల్రెడీ గతంలో చిరూ, బాబీ కలయికలో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చి ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవగా, ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ రానుండటంతో అందరికీ ఈ ప్రాజెక్టు పై మంచి అంచనాలున్నాయి. అయితే ఈ మూవీ గురించి కొన్నాళ్లుగా ఓ వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ను తీసుకుంటున్నారని వార్తలొచ్చాయి.
చిరూ బాబీ2లో మోహన్ లాల్ అని వార్తలు
మెగాస్టార్, మోహన్ లాల్ మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ కూడా ఉండటంతో ఈ కలయిక సాధ్యమవుతుందని అందరూ నిజమనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం చిరూ- బాబీ మూవీలో మోహన్ లాల్ నటించే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతమున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలందరూ సినిమా బడ్జెట్ ను వీలైనంత తగ్గిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కథలో కూడా కొన్నిసార్లు మార్పులు చేయాల్సి వస్తుంది.
బడ్జెట్ విషయంలో ఆలోచనలో పడ్డ నిర్మాతలు
ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా అదే జరుగుతుందని, కథను కాస్త మార్చి దానికి అనుగుణంగా కీలక పాత్రలను పునఃరూపకల్పన చేస్తున్నట్టు చెప్తున్నారు. పైగా మోహన్ లాల్ ఏదైనా ఒక సపోర్టింగ్ రోల్ చేయాలంటే రూ.30 కోట్లకు పైగా ఛార్జ్ చేస్తారు. తగ్గించిన బడ్జెట్ దృష్ట్యా ఏదైనా గెస్ట్ రోల్ అయితే తప్ప, మేకర్స్ ను మోహన్ లాల్ ను ఈ సినిమాలో తీసుకోవడం కష్టమే.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దర్శకనిర్మాతలు ఆ పాత్ర కోసం ఓ ప్రముఖ తెలుగు నటుడిని తీసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా చిరంజీవి పై ఉన్న గౌరవంతో ఆ పాత్ర చేసే వారైతే బడ్జెట్ పరంగా తమకు కూడా కలిసొస్తుందని మేకర్స్ ఆలోచిస్తున్నారట. గతంలో వాల్తేరు వీరయ్యలో రవితేజ ఓ కీలక పాత్ర చేయగా, ఆ టైమ్ లో ఓటీటీ మార్కెట్ స్ట్రాంగ్ గా ఉండటంతో రవితేజకు మంచి రెమ్యూనరేషనే ఇచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేకపోవడంతో ఆ కీలక పాత్ర విషయంలో మేకర్స్ జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది.