ఒకేసారి న‌లుగురు సీనియ‌ర్లు బిజీ బిజీగా!

మెగాస్టార్ చిరంజీవి తదుపరి భారీ ప్రాజెక్టు కోసం దర్శకుడు బాబీ కొల్లితో జతకట్టారు.

Update: 2026-07-08 10:30 GMT

దశాబ్ద కాలం తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో ఓ ఆసక్తికర స‌న్నివేశం చోటు చేసుకుంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున నలుగురు సీనియర్ హీరోలు తదుపరి చిత్రాల షూటింగ్‌లతో ఒకే సమయంలో బిజీగా ఉండ టం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా ఈ తారల సినిమాలు విడివిడిగా వస్తుంటాయి. కానీ 2026 మధ్యలో నలుగురు స్టార్ హీరోలు పూర్తిస్థాయిలో నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులతో బిజీగా ఉండటం అనేది సినీ ప్రియులకు పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి తదుపరి భారీ ప్రాజెక్టు కోసం దర్శకుడు బాబీ కొల్లితో జతకట్టారు. గత చిత్రాల పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుని ఈసారి కథా చర్చల నుంచి నిర్మాణ బాధ్యతల వరకు ఎంతో జాగ్రత్తగా వ్యవహ రిస్తు న్నారు. ఇప్పటికే సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. కెరీర్ లో మరో గుర్తుండిపోయే చిత్రాన్ని అందించాలనే పట్టుదలతో చిరు ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి సారించారు. నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం షూటింగ్‌లో శరవేగంగా పాల్గొంటున్నారు. మాస్ యాక్షన్ అంశాలతో పాటు కొత్త తరహా కథాంశాన్ని ఎంచుకున్న ఆయన ఈ సినిమా విషయంలో ఏ మాత్రం రాజీ పడటం లేదు.

ఇప్పటికే సెట్స్‌లో ఉన్న బాల‌య్య తనదైన శైలిలో యాక్షన్ సీక్వెన్స్‌లను పూర్తి చేస్తున్నారు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ కూడా `ఆదర్శ కుటుంబం` సినిమాతో ఎంతో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న సినిమా క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్‌ల చిత్రీకరణలో పాల్గొంటున్నారు. కథల ఎంపికలో వైవిధ్యం చూపే వెంకటేష్ ఈ సినిమాలో తన పాత్రను అత్యంత సహజంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుండటంతో? త్వరలోనే విడుదల తేదీపై ప్రకటన రానుందని సమాచారం.

కింగ్ నాగార్జున కూడా 100వ సినిమా షూటింగ్‌లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. రా కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. క‌థ విష‌యంలో నాగ్ ఎప్పుడు నేల విడిచి సాము చేయ‌రు. కానీ వంద‌వ సినిమా విష‌యంలో సాము చేసిన‌ట్లే మాట్లాడుకుంటున్నారు. డిఫ‌రెంట్ జాన‌ర్ లో చేస్తోన్న చిత్రంగా వైరల్ అవుతోంది. ఇలా నలుగురు హీరోలు ఒకేసారి షూటింగ్ సెట్స్‌లో ఉండటంతో టాలీవుడ్ లోని అన్ని స్టూడియోలు కళకళలాడుతున్నాయి. ఇది నిర్మాతలకూ, డిస్ట్రిబ్యూటర్లకూ ఎంతో ఊరటనిచ్చే పరిణామం.

సీనియర్లంతా ఒకే సమయంలో బిజీగా ఉండటం వల్ల వచ్చే ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్‌లకు అవ కాశం ఉంది. స్టార్ హీరోల సినిమాలు వరుసగా రావడం వల్ల ప్రేక్షకులకి వినోదానికి లోటు ఉండదు. అయితే ఈ పోటీని అధిగమించి ఏ హీరో సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

Tags:    

Similar News