మెగా మూవీ బడ్జెట్ ఎంత..?

శ్రీకాంత్ ఓదెల సినిమా సక్సెస్ అయితే అదే దారిలో మరికొంతమంది దర్శకులకు మార్గం సుగమం అవుతుందని చెప్పొచ్చు.;

Update: 2025-05-17 16:14 GMT

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా తర్వాత తన 157వ సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సాహు గారపాటి నిర్మిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారని ఫిక్స్ చేశారు. ఐతే ఈ సినిమా తర్వాత చిరంజీవి యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. నాని నిర్మాతగా తన యునానిమస్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందించనున్నారు. చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా 2026 సంక్రాంతి టార్గెట్ తో వస్తుంది. అనుకున్న విధంగా సినిమా ప్పూర్తి చేయడంలో డైరెక్టర్ అనిల్ కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.

సో చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతికి కన్ ఫర్మ్ అన్నట్టే లెక్క. ఐతే ఆ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల తో చేసే సినిమాపై చిరు ఫోకస్ చేయనున్నాడు. నాని శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ సినిమా పూర్తి చేశాకే మెగా 158 ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుంది. ఐతే ఈ మెగా మూవీకి బడ్జెట్ ఎంత.. ఎలాంటి కథతో శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా చేయనున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.

చిరంజీవి శ్రీకాంత్ ఓదెల సినిమా బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడేది లేదన్నట్టు తెలుస్తుంది. నాని నిర్మాతగా ఇన్నాళ్లు కేవలం లో బడ్జెట్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చాడు. ఐతే ఇప్పుడు మెగా మూవీకి మాత్రమే భారీ బడ్జెట్ కేటాయించాలని ప్లాన్ చేస్తున్నారట. ఐతే చిరంజీవితో సినిమా అది కూడా కొత్త దర్శకుడితో అంటే కచ్చితంగా కథ ఎంతో సర్ ప్రైజ్ చేస్తే తప్ప నాని ఇంత సాహసం చేయడని చెప్పుకుంటున్నారు.

కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ నిర్మాతగా తీసిన ప్రతి సినిమా సక్సెస్ అందుకుంటున్న నాని ఈసారి మెగాస్టార్ చిరంజీవితో మెగా మూవీ చేస్తున్నాడు. మరి ఈ సినిమా బడ్జెట్ ఏంటి అన్నది తెలియాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి కూడా తన సినిమాల వేగాన్ని పెంచారు. ఇక మీదట యువ దర్శకులతో కలిసి సినిమాలు చేయాలని చూస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల సినిమా సక్సెస్ అయితే అదే దారిలో మరికొంతమంది దర్శకులకు మార్గం సుగమం అవుతుందని చెప్పొచ్చు. అనిల్ రావిపూడి సినిమా 3 నెలల టార్గెట్ తో వస్తున్నారని తెలుస్తుంది. ఆ నెక్స్ట్ శ్రీకాంత్ ఓదెల సినిమా పనుల్లో చిరు బిజీ కానున్నారు.

Tags:    

Similar News