వరప్రసాద్ సెట్ లో పెళ్లి కాని ప్రసాద్..!

వర ప్రసాద్ కోసం పెళ్లికాని ప్రసాద్ అదే మన విక్టరీ వెంకటేష్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నారు. ఐతే అనిల్ రావిపూడి చిరంజీవి, వెంకటేష్ తో ఒక సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.;

Update: 2025-10-22 04:32 GMT

అనిల్ రావిపూడి డైఎర్క్షన్ లో మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో వస్తున్న సినిమా మన శంకర వర ప్రసాద్. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు భీంస్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే మన శంకర వరప్రసాద్ గారు నుంచి వచ్చిన టీజర్ తో పాటు మీసాల పిల్ల సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో చిరంజీవిని వింటేజ్ కామెడీ టైమింగ్ తో చూపించే ప్రయత్నం చేస్తున్నాడట అనిల్ రావిపూడి. ఐతే మన శంకర వరప్రసాద్ సినిమాలో విక్టరీ వెంకటేష్ క్యామియో కూడా ఉంటుందని తెలుస్తుంది.

అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్ లో 3 సూపర్ హిట్ సినిమాలు..

సినిమాలో వెంకటేష్ రోల్ ఏంటన్నది తెలియదు కానీ చిరంజీవి, వెంకటేష్ ఇద్దరు స్క్రీన్ మీద అలా మెరిసే సీన్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయట. అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్ లో 3 సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఈ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. వెంకటేష్ సెంటిమెంట్ ని చిరంజీవి సినిమాకు వాడేస్తున్నాడు అనిల్ రావిపూడి. మన శంకర వర ప్రసాద్ సినిమా షూటింగ్ లో సోమవారం నుంచి వెంకటేష్ పాల్గొన్నారు.

వర ప్రసాద్ కోసం పెళ్లికాని ప్రసాద్ అదే మన విక్టరీ వెంకటేష్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నారు. ఐతే అనిల్ రావిపూడి చిరంజీవి, వెంకటేష్ తో ఒక సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సాంగ్ కచ్చితంగా కొన్నాళ్ల పాటు గుర్తుండిపోయేలా ఉంటుందని చెప్పొచ్చు. దశాబ్దాలుగా సోలో సినిమాలతో ఫ్యాన్స్ ని అలరిస్తూ వచ్చిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి కలిసి ఒక సినిమా చేస్తున్నారు. అఫ్కోర్స్ వెంకటేష్ చేసేది క్యామియో రోల్ అయినా కూడా కచ్చితంగా మన శంకర వరప్రసాద్ గారు మీద ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.

మన శంకర వరప్రసాద్ గారు పండగ వైబ్ ని డబల్ చేసేలా..

మన శంకర వరప్రసాద్ గారు సినిమాను సంక్రాంతి బరిలో దించుతున్నారు మేకర్స్. సినిమాను పండగ వైబ్ ని డబల్ చేసేలా అనిల్ ప్లాన్ చేస్తున్నాడు. చిరంజీవి సినిమాలో వెంకటేష్ క్యామియో కచ్చితంగా ఇలాంటి కాంబినేషన్స్ ని మళ్లీ మళ్లీ చేసేలా మంచి జోష్ ఇస్తుందని చెప్పొచ్చు. చిరంజీవి తో నయనతార జత కడుతున్న ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా అదిరిపోతుందని తెలుస్తుంది.

మన శంకవర ప్రసాద్ గారులో క్యామియో ఇస్తున్న వెంకటేష్ నెక్స్ట్ త్రివిక్రం తో సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు. హారిక హాసిని బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

Tags:    

Similar News