మెగా ప్లానింగ్ చూస్తే మ‌తి పోవాల్సిందే!

మెగాస్టార్ చిరంజీవి. రీసెంట్ గానే 70వ పుట్టిన రోజు జ‌రుపుకున్నారు. ఈ ఏజ్ లో కూడా ఆయన సినిమాలు చేస్తున్న స్పీడు చూస్తే ఎవ‌రైనా ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే.;

Update: 2025-08-23 16:30 GMT

మెగాస్టార్ చిరంజీవి. రీసెంట్ గానే 70వ పుట్టిన రోజు జ‌రుపుకున్నారు. ఈ ఏజ్ లో కూడా ఆయన సినిమాలు చేస్తున్న స్పీడు చూస్తే ఎవ‌రైనా ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. అయితే భోళా శంక‌ర్ సినిమాతో డిజాస్ట‌ర్ అందుకున్న మెగాస్టార్ ఆ త‌ర్వాతి సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్న విష‌యం తెలిసిందే. ఒక ఫ్లాప్ వ‌చ్చింద‌ని మ‌రీ ఇంత లేటు చేస్తే ఎలా అని మెగా ఫ్యాన్స్ ఆ స‌మ‌యంలో ఫీల‌య్యారు కూడా.

నెక్ట్స్ స‌మ్మ‌ర్ కు విశ్వంభ‌ర‌

కానీ చిరూ ఆ గ్యాప్ ను మ్యానేజ్ చేస్తూ త‌ర్వాత వ‌రుస సినిమాల‌ను లైన్ లో పెట్టారు. ముందుగా వశిష్ట ద‌ర్శ‌క‌త్వంలో విశ్వంభ‌ర‌ను లైన్ లో పెట్టిన చిరంజీవి, ఆ సినిమాను ఆల్రెడీ పూర్తి చేశారు. ప్ర‌స్తుతం విశ్వంభ‌ర‌కు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుగుతున్నాయి. వాస్త‌వానికి ఇప్ప‌టికే రావాల్సిన ఈ సినిమా వీఎఫ్ఎక్స్ వ‌ర్క్స్ ఆల‌స్యం అవ‌డం వ‌ల్ల నెక్ట్స్ ఇయ‌ర్ స‌మ్మ‌ర్ కు వాయిదా ప‌డింది.

సంక్రాంతికి మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు

విశ్వంభ‌ర‌ను ఇప్ప‌టికే ఫినిష్ చేసిన చిరూ ప్ర‌స్తుతం అనిల్ రావిపూడితో మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు సినిమాను చేస్తున్నారు. అనిల్ తో షూటింగ్ అంటే ఎలా ఉంటుందో తెలిసిందే. షూటింగ్ ను సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా ప‌రిగెత్తిస్తారు. మ‌రో నెల‌లో ఈ షూటింగ్ లో వెంక‌టేష్ కూడా జాయిన‌వుతారు. ఎట్టి ప‌రిస్థితుల్లో 2026 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయ‌డం ప‌క్కా.

వ‌చ్చే ఏడాది చిరూ నుంచి మూడు సినిమాలు

సో జ‌న‌వ‌రి నుంచి చిరంజీవి ఎలాగూ ఫ్రీ అయిపోతారు కాబ‌ట్టి ఆ త‌ర్వాత వెంట‌నే బాబీ తో క‌లిసి మెగా 158ను సెట్స్ పైకి తీసుకెళ్తారు. గ‌త ఆరేడు నెల‌లుగా బాబీ ఈ ప్రాజెక్టుపైనే వ‌ర్క్ చేస్తున్నారు. అంటే విశ్వంభ‌ర రిలీజ్ నాటికి దాదాపు బాబీ సినిమా పూర్తయ్యే ద‌శ‌కు వ‌స్తుంది. ఈ లోపు ఎలాగో ప్యార‌డైజ్ రిలీజైపోయి శ్రీకాంత్ ఫ్రీ అవుతాడు కాబ‌ట్టి మెగా159 సెట్స్ పైకి తీసుకెళ్లొచ్చు. కాబ‌ట్టి ఎంత‌లేద‌న్నా వ‌చ్చే ఏడాది చిరూ నుంచి మూడు సినిమాలు రావ‌డం ప‌క్కా. శ్రీకాంత్ సినిమా 2027 స్టార్టింగ్ లో వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

Tags:    

Similar News